twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Republic Movie day 7 collections: పాజిటివ్ టాక్ వచ్చినా పెట్టుబడిలో సగం కూడా రాలేదు.. ఇంకా ఎంత రావాలంటే?

    |

    టాలీవుడ్ మెగాహీరో సాయి ధరమ్ తేజ్ గతవారం రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులు నుంచి అయితే బాస్ టిక్ టాక్ ను సొంతం చేసుకుంది ఇక బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో అయితే ఏరా బట్ట లేక పోయింది మొదటిరోజు చేసినప్పటికీ ద్వారం సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గుతూ వచ్చాయి. రిపబ్లిక్ సినిమాకు పవన్ కళ్యాణ్ స్పీచ్ ద్వారానే కొంత హైప్ క్రియేట్ అయ్యింది.

    సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా జలకు పెంచేశాయి. ఇక మొత్తానికి సినిమా 7 రోజులలో పూర్తి చేసుకుంది ఇక బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయో ఒక లుక్కేద్దాం..

    మొత్తం 740 థియేటర్స్ లలో విడుదల

    మొత్తం 740 థియేటర్స్ లలో విడుదల

    రిపబ్లిక్ సినిమాను మొదట తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కువ థియేటర్స్ లలో విడుదల చేశారు. తెలంగాణ లో మొత్తంగా 215 థియేటర్లలో విడుదలవ్వగా ఆంధ్రప్రదేశ్లో 380 థియేటర్స్ లలో రిపబ్లిక్ సినిమా భారీ స్థాయిలో విడుదల అయ్యింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 600 థియేటర్లలో ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 740 కి పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.

    అప్పుడే తగ్గుతూ వచ్చిన కలెక్షన్స్

    అప్పుడే తగ్గుతూ వచ్చిన కలెక్షన్స్

    రిపబ్లిక్ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 12.8 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ మార్కెట్లోకి ప్రవేశించగా.. ప్రపంచవ్యాప్తంగా 13.6 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వాలి అంటే 14కోట్ల వరకు షేర్ ను రబట్టాల్సి ఉంటుంది. కానీ సినిమా అనుకున్నంతగా ఓపెనింగ్స్ అయితే రాబట్టలేదు. ఎవరు ఊహించని విధంగా మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి.

    రోజురోజుకు భారీగా తగ్గిన కలెక్షన్స్

    రోజురోజుకు భారీగా తగ్గిన కలెక్షన్స్

    'రిపబ్లిక్' మూవీకి 7వ రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. రోజుల వారిగా చూసుకుంటే.. మొదటి రోజు 2.01కోట్లు, రెండవరోజు 1.24కోట్లు, మూడవ రోజు 1.20కోట్లు, నాలుగవ రోజు 40లక్షలు, 5వ రోజు 30లక్షలు, ఆరవ రోజు 20లక్షలు, ఏడవ రోజు 16లక్షలు వచ్చాయి. ఎపి తెలంగాణలో మొదటి వారంలో 5.51కోట్ల షేర్ రాగా.. 9.15కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టింది.

    మొదటి వారంలో వచ్చింది ఎంత?

    మొదటి వారంలో వచ్చింది ఎంత?

    మొత్తంగా ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 1.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 70 లక్షలు, ఈస్ట్‌లో రూ. 40 లక్షలు, వెస్ట్‌లో రూ. 38 లక్షలు, గుంటూరులో రూ. 43 లక్షలు, కృష్ణాలో రూ. 41 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో...మొత్తంగా రూ. 5.51కోట్ల షేర్ రాగా.. 9.15కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టింది.

    ప్రపంచం వ్యాప్తంగా రిపబ్లిక్ కలెక్షన్స్

    ప్రపంచం వ్యాప్తంగా రిపబ్లిక్ కలెక్షన్స్

    తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో రూ. 5.51 కోట్ల షేర్ రాబట్టిన సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 45 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ. 6.26 కోట్లు షేర్, రూ. 11.61 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అయితే సినిమాకి టాక్ బాగున్నప్పటికీ.. కలెక్షన్లు మాత్రం క్రమంగా పడిపోతున్నాయి.

    Recommended Video

    Kondapolam Movie Team Interview
    హిట్ అవ్వాలంటే.. ఇంకా ఎంత రావాలి?

    హిట్ అవ్వాలంటే.. ఇంకా ఎంత రావాలి?

    సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ తోనే విడుదల అయ్యింది. అన్ని ఏరియాల్లో కలుపుకొని రూ. 13.60 కోట్లు మేర వ్యాపారం జరిగింది. ఇక బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 14 కోట్లుగా నమోదైంది. ఇక. ఈ సినిమా ఏడు రోజుల్లో రూ. 6.26 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 6.24 కోట్లు వసూలు చేస్తే బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుంది.

    English summary
    Mega Hero Sai Dharam Tej Now Did Republic Movie Under Deva Katta Direction. This Movie Collect 6.26 Cr in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X