twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. ఏపీలోనే ఎక్కువ థియేటర్లలో రిపబ్లిక్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

    |

    సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. దర్శకుడు దేవకట్టా కూడా సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ప్ర‌జాస్వామ్యం అంటే ప్ర‌జ‌లే పాల‌కులు అనే కాన్సెప్ట్ హైలెట్ చేసి చూపించబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన విధానంతో ఒక్కసారిగా ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ ప్రభావం సినిమాపై ఎలా ఉంటుంది అనే విషయం బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ బట్టి క్లారిటీగా అర్థమవుతుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా గట్టిగానే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

     పవన్ స్పీచ్ ఎఫెక్ట్..

    పవన్ స్పీచ్ ఎఫెక్ట్..

    రిపబ్లిక్ సినిమాపై మొదట్లో అయితే పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారో అప్పటినుంచి కూడా ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నిజానికి పవన్ మాట్లాడింది సినిమా ఈవెంట్ లో అని ఎవరు ఊహించలేదు. ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత రిపబ్లిక్ కూడా చాలా హైలెట్ గా మారింది. ఇక ఈ ప్రభావం సినిమాపై ఎంత వరకు చూపిస్తుంది అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఒక పెద్ద సందేహం.

    ఇండస్ట్రీ యూ టర్న్

    ఇండస్ట్రీ యూ టర్న్

    ఇప్పటికే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు మద్దతు తెలిపేందుకు చాలా మంది వెనుకడుగు వేశారు. ఒకరిద్దరు హీరోల తప్పితే ఎవరూ కూడా ఆయన చెప్పిన మాటలకు సపోర్ట్ చేయలేకపోయారు. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా సహాయపడుతుంది అంటూ ఒక్కసారిగా నిర్మాతలు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా యూటర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

     మొన్నటివరకు మూతపడిన థియేటర్స్

    మొన్నటివరకు మూతపడిన థియేటర్స్

    ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం ఒక విధంగా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే రిపబ్లిక్ సినిమా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు చాలా థియేటర్స్ మూతపడి ఉన్నాయి. టికెట్ల రేట్లు అనుకూలంగా లేకపోవడంతో నిర్మాతలు కూడా అక్కడ ఎక్కువ స్థాయిలో సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపలేదు.

     ఏపీ లోనే ఎక్కువగా..

    ఏపీ లోనే ఎక్కువగా..

    తెలంగాణ లో మొత్తంగా 215 థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుండగా ఆంధ్రప్రదేశ్లో 380 థియేటర్స్ లలో రిపబ్లిక్ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో కలిపి 600 థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 740 కి పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

     బాక్సాఫీస్ టార్గెట్..

    బాక్సాఫీస్ టార్గెట్..

    ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం వర్షాల వలన లవ్ స్టోరీ కలెక్షన్స్ పై ప్రభావం గట్టిగానే చూపించింది. ఇక రిపబ్లిక్ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 12.8 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 13.6 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వాలి అంటే 14కోట్ల వరకు షేర్ ను రబట్టాల్సి ఉంటుంది.

    Recommended Video

    Love Story Movie Success Meet | Naga Chaitanya | Sai Pallavi
    పోటీ లేకపోయినా..

    పోటీ లేకపోయినా..

    ప్రస్తుతం సినిమాపై అయితే అంచనాలు ఒకవిధంగా బాగానే ఉన్నాయి. అంతే కాకుండా లవ్ స్టోరీ సినిమా ప్రస్తుతం పెద్దగా హడావుడి చేయడం లేదు. 6వ రోజు కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. కోటి కంటె తక్కువ షేర్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక రిపబ్లిక్ సినిమాకు పోటీ పెద్దగా ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంత వరకు కనిపిస్తుందో మొదటి రోజు కలెక్షన్స్ బట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ గా సాయి ధరమ్ తేజ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

    English summary
    Sai dharam tej republic movie pre release bussiness,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X