Don't Miss!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- News
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు..!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Republic OTT: ఆ ఓటీటీలో రిపబ్లిక్.. సాయి తేజ్ మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందంటే!
మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. బ్యాగ్రౌండ్‌తో వచ్చినా ఇందులో కొందరు తమ టాలెంట్లను నిరూపించుకుని స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే తన సత్తాను నిరూపించుకున్న అతడు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మధ్యలో చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి' చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా హిట్ల మీద హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు.
బెడ్రూంలో లవర్‌తో శృతి హాసన్ సరసాలు: ఏకంగా అతడి మీద పడుకుని.. వామ్మో ఇది మహా దారుణం!
ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్‌లు సొంతం చేసుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతడు ఆస్పత్రి బెడ్‌పై ఉన్నప్పటికీ.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. అలాగే, దీన్ని మెగా ఫ్యామిలీ అండదండలతో విడుదల చేశారు. ఇక, ఈ మూవీకి మంచి టాక్‌తో పాటు రివ్యూలు కూడా మంచిగానే వచ్చాయి.
పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో భారీ అంచనాలతో వచ్చిన 'రిపబ్లిక్' సినిమాకు ఆరంభంలో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, ప్రతికూల పరిస్థితులకు తోడు కొన్ని ఇష్యూల కారణంగా దీనికి కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఫలితంగా రూ. 14 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ముగింపు సమయానికి కేవలం రూ. 6.86 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా రూ. 5.64 కోట్లు నష్టాలను ఎదుర్కొంది. ఫలితంగా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక, ఈ ఫలితంతో సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలకు సైతం బ్రేక్ పడిపోయినట్లు అయింది.
షర్ట్ విప్పేసి బ్రా తీసేసి అషు రెడ్డి రచ్చ: హాట్ షోలో హద్దు దాటేసి.. మరీ ఇలా చూపిస్తారా!

మంచి టాక్ ఉన్నా ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టడంలో విఫలమైన 'రిపబ్లిక్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఈ మధ్య పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని నవంబర్ 26 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సదరు సంస్థ 'మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రిపబ్లిక్' మూవీలో టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, సీనియర్ నటి రమ్యకృష్ణ ఎంతో ముఖ్యమైన సీఎం పాత్రను పోషించింది. దీన్ని భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు.