'చిత్రలహరి' కలెక్షన్స్: అదరగొట్టేసిన తేజు చిత్రం.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే!

Recommended Video

Chitralahari Movie First Day Box-Office Collections || Filmibeat Telugu

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ కెరీర్ జోరు ఇటీవల బాగా తగ్గింది. ఓ మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని తేజు భావిస్తున్నారు. అలాంటి తరుణంలో చిత్రలహరి చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ విమర్శకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ యువత నుంచి మాత్రం చిత్రలహరికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. మంచి అంచనాలతో విడుదలైన చిత్రలహరి తొలిరోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం!

 మైత్రి మూవీస్ నిర్మాణంలో

మైత్రి మూవీస్ నిర్మాణంలో

చిత్రలహరి చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శుక్రవారం ఈ చిత్రం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయిధరమ్ తేజ్ పాత్రని దర్శకుడు అద్భుతంగా తీర్చి దిద్దినట్లు ప్రశంసలు దక్కుతున్నాయి. తేజు నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. వెన్నెల కిషోర్, పోసాని, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా

ప్రపంచ వ్యాప్తంగా

చిత్రలహరి చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4.6 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల హంగామా ముగియడం, ఇంకా వీకెండ్ ఉండడం చిత్రలహరి చిత్రానికి కలసి వచ్చే అంశాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ చిత్రం 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదే జోరు రాబోవు రోజుల్లో కూడా కొనసాగితే చిత్రలహరి కమర్షియల్ గా మంచి విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది.

 ఏరియాలవారీగా షేర్స్

ఏరియాలవారీగా షేర్స్

యువత నుంచి అందుతున్న మద్దతుతో చిత్రలహరి నైజాంలో తొలిరోజు 83 లక్షల షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్రలో 43 లక్షలు, సీడెడ్ లో 52 లక్షలు రాబట్టింది. గుంటూరులో 32 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 39 లక్షలు, వెస్ట్ లో 25 లక్షలు రాబట్టడం విశేషం. నెల్లూరులో 15 లక్షలు, కృష్ణ జిల్లాలో 24 లక్షలుగా చిత్రలహరి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఓవర్సీస్ లో చిత్రలహరికి మంచి స్పందనే వస్తోంది. తొలి రోజు ఈ చిత్రం యూఎస్ లో 44 లక్షల షేర్ రాబట్టింది. కర్ణాటకలో 33 లక్షలు రాబట్టింది.

 హిట్ కావాలంటే

హిట్ కావాలంటే

చిత్రలహరి చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ మీడియం రేంజ్ లోనే జరిగింది. తేజు గత చిత్రాల రిజల్ట్ దృష్ట్యా బయ్యర్లు తక్కువ మొత్తానికే ఈ చిత్రాన్ని కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చిత్రలహరి చిత్ర థియేట్రికల్ హక్కులు 12.8 కోట్లకు అమ్ముడయ్యాయి. తొలి రోజే 4 కోట్లు రాబట్టడంతో.. ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టం కాకపోవచ్చు. వీకెండ్ వసూళ్ళని బట్టి చిత్రలహరి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో అంచనా వేసే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X