twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ రిపోర్ట్: చిత్రలహరి వసూళ్ల జోరు.. మూడు రోజుల్లో ఎంతంటే!

    |

    Recommended Video

    Sai Dharam Tej's Chitralahari Movie Three days Box Office Collections || Filmibeat Telugu

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రలహరి చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్, యువత నుంచి చిత్రలహరికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. తొలి రోజు ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కాయి. వీకెండ్ వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం!

     విజయం దిశగా

    విజయం దిశగా

    వరుస పరాజయాలతో సతమతమైన సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు గట్టెక్కినట్లే కనిపిస్తున్నాడు. చిత్రలహరి చిత్రం విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో ప్రేమ కథ, సాయిధరమ్ తేజ్, పోసాని పాత్రలు బాగా ఆకట్టుకుంటున్నాయి. కిషోర్ తిరుమల నేను శైలజ తర్వాత మరో హిట్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిత్రలహరి బలమైన వసూళ్లతో రాణిస్తోంది.

     మూడురోజుల్లో

    మూడురోజుల్లో

    చిత్రలహరి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.75 కోట్ల షేర్ రాబట్టింది. పలు ఏరియాలలో బయ్యర్లు లాభాలకు చేరువవుతున్నారు. తొలి వారం ముగిసే సమయానికి చిత్రలహరి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీం తర్వాత తేజుకు దక్కిన విజయం ఇదే. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రలో దాదాపు 3 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత శని, ఆదివారం రోజు కూడా జోరు కొనసాగించింది.

     నైజాంలో దూకుడు

    నైజాంలో దూకుడు

    అన్ని ప్రాంతాల కంటే నైజాం ఏరియాలో చిత్రలహరి వసూళ్లు బలంగా కొనసాగుతున్నాయి. వీకెండ్ ముగిసే సమయానికి చిత్రలహరి నైజాంలో 2. 53 కోట్ల షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్రలో 1. 28 కోట్లు, సీడెడ్ లో 1.10 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మిగిలిన ప్రాంతాల్లో కూడా చిత్రలహరి వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో మూడు రోజుల్లో ఈచిత్రం 78 లక్షల షేర్ వసూలు చేసింది. కృష్ణాలో 60 లక్షలు, గుంటూరులో 67 లక్షలు, నెల్లూరులో 29 లక్షలుగా చిత్రలహరి వసూళ్లు నమోదయ్యాయి.

    ఎంత రాబట్టాలంటే

    ఎంత రాబట్టాలంటే

    చిత్రలహరి చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ విలువ 12.14 కోట్లు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రలహరి 7.75 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్, ఇండియాలో ఇతర ప్రాంతాల వసూళ్లు కలుపుకుంటే 3 రోజుల్లో చిత్రలహరి దాదాపు 10 కోట్ల వరకు షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీనితో వీకెండ్ ముగిసే సమయానికే చిత్రలహరి బయ్యర్లు లాభాలు అందుకోనున్నారు. వేసవి సెలవులు కూడా ఈ చిత్రాన్ని కలసి వస్తున్నాయి.

    English summary
    Sai Dharam Tej's Chitralahari movie Three days Box Office Collections. Chitralahari movie released on 12th April. Kishore Tirumala is the director. Kalyani Priyadarshan, Nivetha Pethuraj are playing female leads
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X