సాయి ధరమ్ తేజ‘పిల్లా.. నువ్వులేని జీవితం’రిలీజ్ ఖరారు

By Srikanya

Sai Dharam Tej's Pilla Nuvvu Leni Jeevitham in Summer
హైదరాబాద్: సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా గీతా ఆర్ట్స్, ఎస్.వి.సి. సినిమా పతాకాలపై నిర్మిస్తున్న చిత్రం 'పిల్లా.. నువ్వులేని జీవితం.' ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో బన్నీవాసు, హర్షిత్ నిర్మిస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మే రెండో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు నిర్మాతలు తెలియచేసారు. సంగీతం ఏప్రియల్ లో విడుదల చేయనున్నారు.

చిత్ర దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ... ఈ సినిమాకోసం నాలుగైదు టైటిల్స్ అనుకున్నామని, అందులో బెస్ట్ చాయిస్‌గా ఎంపిక చేయమని, మాటీవీ ద్వారా ప్రేక్షకులను అడిగామనీ, దాదాపు అందరూ ఇదే పేరును ఎంపిక చేశారని, కథకు కూడా ఈ పేరే సరైనదని తెలిపారు. ఇందులో ప్రకాష్‌రాజ్, జగపతిబాబుల పాత్రలు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. పేరుగూర్చి తర్జనభర్జనలు పడుతుంటే నాలుగు పేర్లు అనుకుని, చివరికి ఈ పేరును ఖరారు చేశామని తెలిపారు.

హీరో సాయి ధరమ్ తేజ మాట్లాడుతూ... పెద్ద నిర్మాతలైన దిల్‌రాజు, అల్లుఅరవింద్‌ల నేతృత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లేలో సరికొత్త మ్యాజిక్ ఉంటుందని, అందరికీ నచ్చే చిత్రంగా రూపొందుతున్న ఇది తన రెండవ చిత్రంగా రూపొందడం ఆనందంగా వుందని తెలిపారు.

జగపతిబాబు మాట్లాడుతూ... శ్రీహరిగారంటే నాకు చాలా అభిమానం ఇష్టం. 'పిల్లానువ్వులేని జీవితం' సినిమాలో ఆయన స్థానాన్ని భర్తీ చేయాలి.. అని అడిగినప్పుడు ముందు 'వద్దు' అని చెప్పేశా. కానీ తప్పలేదు. కానీ.. షూటింగ్‌కి వెళ్లేముందు శ్రీహరి ఫొటోకి దండం పెట్టుకొని వెళ్లా అన్నారు.

చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నబాబు, వేమారెడ్డి, నిర్మాతలు:బన్ని వాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X