11 రోజుల పండగ.. ప్రతీ రోజూ అదే హవా.. కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ మెగా మేనల్లుడి ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. విడుదలై 11 రోజులు గడిచినా ఇంకా అన్నిచోట్ల కూడా ఈ సినిమా హంగామా కనిపిస్తుండటం విశేషం. ఈ 11 రోజుల్లో సాయి ధరమ్ తేజ్ ఎన్ని కోట్లు కొల్లగొట్టాడో చూద్దామా..

తెలుగు ప్రజల మనసు దోచుకుంటూ.. కోట్లు కొల్లగొట్టి
ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తెలుగు ప్రజల మనసు దోచుకుంది. క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా ‘ప్రతిరోజూ పండగే' సినిమాకు కనెక్ట్ అయ్యారు. దీంతో విడుదలైన 11 రోజుల్లో ప్రతి రోజూ కలెక్షన్ల ప్రవాహం కనిపించింది. మొత్తంగా 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21. 88 కోట్లు రాబట్టింది ఈ మూవీ.

రోజు వారీగా రిపోర్ట్..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రతిరోజూ పండగే' రోజువారి రిపోర్ట్ చూస్తే క్రింది విధంగా ఉంది.
Day 1: 3.23 కోట్లు
Day 2: 2.58 కోట్లు
Day 3: 3.19 కోట్లు
Day 4: 1.64 కోట్లు
Day 5: 1.85 కోట్లు
Day 6: 2.80 కోట్లు
Day 7: 1.79 కోట్లు
Day 8: 88 లక్షలు
Day 9: 1.40 కోట్లు
Day 10: 1.88 కోట్లు
Day 11: 64 లక్షలు

లాభాల బాట.. అల్లు అర్జున్ ఫీలింగ్స్
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే గాక వరల్డ్ వైడ్‌గా ‘ప్రతిరోజూ పండగే' సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా లాభాల బాట పట్టిందని సినిమాపై అల్లు అర్జున్ తన అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సినిమా చుసిన రామ్ చరణ్.. వెంటనే
ఇక ఇటీవలే ‘ప్రతిరోజూ పండగే' సినిమా చూసిన రామ్ చరణ్.. ఆ వెంటనే చిత్ర యూనిట్‌ను అభినందించాడు. కుటుంబ విలువలను కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఎంటర్‌టైన్ చేసిన ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా చూడాలని రామ్ చరణ్ పేర్కొన్నాడు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్, మారుతి ప్రతిభ భేష్ అన్నాడు చెర్రీ.

ప్రతిరోజూ పండగే విశేషాలు
అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. కుటుంబ విలువలతో కూడిన ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నింటిలో సూపర్ అనిపించుకుంది.


Click it and Unblock the Notifications











