మూడు రోజుల్లో 'ప్రతిరోజూ పండగే'.. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తే..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి టాక్‌ అందుకుంది.

దర్శకుడు మారుతీ తెరకెక్కించిన విధానం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా తీర్చిదిద్దిన సన్నివేశాలు, ముఖ్యంగా కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి. రావు రమేష్‌, సత్యరాజ్‌ పాత్రలకు మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది ఈ సినిమా. ఇప్పటికే చిత్రయూనిట్ 'ప్రతిరోజూ పండగే' సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.

Sai Dharam Tejs Prati Roju Pandage 3 days Collection Report

తాజాగా మొదటి మూడు రోజుల్లో 'ప్రతిరోజూ పండగే' సినిమా రాబట్టిన కలెక్షన్స్ వివరాలు తెలుపుతూ కొత్త పోస్టర్ షేర్ చేశారు యూనిట్ సభ్యులు. ఈ మేరకు వరల్డ్ వైడ్‌గా మొదటి మూడు రోజుల్లో 'ప్రతిరోజూ పండగే' సినిమా 23.25 కోట్ల గ్రాస్ రాబట్టిందని తెలిపారు. ఈ రోజుతో 25 కోట్ల మార్క్ కూడా దాటేయనుందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

గత కెరీర్‌లో కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్‌కి ప్రతిరోజూ పండగే మూవీ సక్సెస్ అందించిందని అంటున్నారు జనం. ఏదేమైనా మారుతి డైరెక్షన్, సాయి ధరమ్ తేజ్ యాక్షన్, రాశి ఖన్నా అందాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X