twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతిరోజూ పండగే కలెక్షన్స్: మెగా మేనల్లుడు మాంచి ఫామ్‌లో ఉన్నాడుగా!

    |

    మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో డైరెక్టర్ మారుతి ఆయనతో ప్రతిరోజూ పండగే సినిమా తెరకెక్కించాడు. కామెడీ అంశాలతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా డిసెంబర్ 20న విడుదలై తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ హోల్డ్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా తొలివారం పూర్తిచేసుకుంది. మొదటి వారాంతంలో ఈ సినిమా కలెక్షన్స్ రిపోర్ట్స్ చూస్తే..

    మూడు రోజులు గడిచింది.. ఆడియన్స్ రెస్పాన్స్

    మూడు రోజులు గడిచింది.. ఆడియన్స్ రెస్పాన్స్

    మొదటి మూడు రోజుల్లో ‘ప్రతిరోజూ పండగే' సినిమా 23.25 కోట్ల గ్రాస్ రాబట్టిందని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. ఈ మేరకు వరల్డ్ వైడ్‌గా మొదటి మూడు రోజుల్లో ‘ప్రతిరోజూ పండగే' సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది తెలిపారు. అతిత్వరలో ఈ సినిమా లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు మేకర్స్.

    ఆదివారం వసూళ్లు.. హిట్ ట్రాక్ దిశగా

    ఆదివారం వసూళ్లు.. హిట్ ట్రాక్ దిశగా

    ప్రస్తుతం పోటీగా ఉన్న సినిమాల కంటే ‘ప్రతిరోజూ పండగే' సినిమానే బెటర్ కావడంతో ప్రేక్షకుల ఓటు ఈ చిత్రానికే పడింది. దీంతో డీసెంట్ కలెక్షన్స్ హోల్డ్ చేస్తూ దూసుకుపోతోంది. వారాంతం అయిన ఆదివారం వసూళ్లు తొలిరోజు స్థాయిలో ఉండడంతో ఇక ఈ సెలెనా హిట్ ట్రాక్ వైపు పయనిస్తోందని అంటున్నారు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

    తొలిరోజు కంటే మూడో రోజే..

    తొలిరోజు కంటే మూడో రోజే..

    ‘ప్రతిరోజూ పండగే' సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధిక వసూళ్లు వస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల డిస్ట్రిబ్యూటర్ షేర్ సుమారు 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.9 కోట్ల షేర్ వసూలుచేసిన ‘ప్రతిరోజూ పండగే' సినిమా మూడో రోజు బాగా పుంజుకొని 3.2 కోట్లు రాబట్టింది.

    ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం..

    ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం..

    ఇక ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మొత్తం మీద మూడు రోజుల్లో 9.06 కోట్ల షేర్ వసూలు చేసింది ‘ప్రతిరోజూ పండగే' సినిమా. నైజాం 3.8 కోట్లు, సీడెడ్ 1.10 కోట్లు, ఉత్తరాంధ్ర 1.33 కోట్లు, గుంటూరు 66 లక్షలు, తూర్పుగోదావరి 68 లక్షలు, పశ్చిమ గోదావరి 52 లక్షలు, కృష్ణా 63 లక్షలు, నెల్లూరు 34 లక్షలు, మొత్తంగా షేర్ 9.06 కోట్లుగా ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

     4వ రోజు వర్కింగ్ డే కావడంతో..

    4వ రోజు వర్కింగ్ డే కావడంతో..

    నాలుగో రోజు (సోమవారం) కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. 4వ రోజు వర్కింగ్ డే కావడంతో కొంతమేర కలెక్షన్స్ డ్రాప్ అయినా సుమారుగా 1.8 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ రిపోర్ట్స్ చూసి మెగా మేనల్లుడు మాంచి ఫామ్‌లో ఉన్నాడుగా! అంటున్నారు జనం.

     సినిమాకు అవే ప్లస్..

    సినిమాకు అవే ప్లస్..

    గత కెరీర్‌లో కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్‌కి 'ప్రతిరోజూ పండగే' మూవీ సక్సెస్ అందించిందని టాక్ నడుస్తోంది. ఏదేమైనా మారుతి డైరెక్షన్, సాయి ధరమ్ తేజ్ యాక్షన్, రాశి ఖన్నా అందాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు.

    English summary
    Suprem hero Sai Dharam Tej movie Prathi Roju Pangade with director maruthi released and running successfully. This movie four days collections are.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X