Republic Total Collections: పాజిటివ్ టాక్‌తో దారుణంగా కలెక్షన్లు.. ఎన్ని కోట్ల నష్టం వచ్చిందంటే!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే తన సత్తాను నిరూపించుకున్న అతడు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మధ్యలో చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి' చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస హిట్లను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

‘రిపబ్లిక్’ అంటూ వచ్చిన మెగా హీరో
సూపర్ ఫామ్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు దేవ కట్టాతో 'రిపబ్లిక్' అనే సినిమాను చేశాడు. దీన్ని భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేయగా.. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించింది. మణి శర్మ ఈ మూవీకి సంగీతం అందించాడు.

భారీ అంచనాలు.. ప్రీ బిజినెస్ ఎంత?
వరుస విజయాలు అందుకున్న సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన'రిపబ్లిక్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 13.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. కోవిడ్ తర్వాత ఇది భారీ బిజినెసే అన్న టాక్ వినిపించింది.

హీరో లేకున్నా.. మంచి టాక్ వచ్చింది
'రిపబ్లిక్' మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతడు ఆస్పత్రి బెడ్‌పై ఉన్నప్పటికీ.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. అలాగే, దీన్ని మెగా ఫ్యామిలీ అండదండలతో విడుదల చేశారు. ఇక, ఈ మూవీకి మంచి టాక్‌తో పాటు రివ్యూలు కూడా మంచిగానే వచ్చాయి.

రెండు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇలా
'రిపబ్లిక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 1.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 79 లక్షలు, ఈస్ట్‌లో రూ. 45 లక్షలు, వెస్ట్‌లో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 47 లక్షలు, కృష్ణాలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో.. మొత్తం రూ. 6.04 కోట్లు షేర్, రూ. 10.05 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే
తెలుగు రాష్ట్రాల్లో ముగింపు సమయానికి దారుణంగా రూ. 6.04 కోట్లు షేర్ రాబట్టిన సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 49 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముగింపు సమయానికి రూ. 6.86 కోట్లు షేర్, రూ. 12.65 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. దీంతో టార్గెట్‌ను చేరకుండా నిరాశను మిగిల్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంతంటే
సాయి తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 13.60 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 14 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి రూ. 6.86 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే రూ. 5.64 కోట్లు నష్టాలను ఎదుర్కొని డిజాస్టర్‌గా మిగిలింది.


Click it and Unblock the Notifications











