Republic Movie Day 1 Collection: సాయిధరమ్ తేజ్ మూవీ తొలి రోజు వసూళ్ల టార్గెట్ ఎంతంటే?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ వివాదాలు, అనేక సంచలనాల మధ్య థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందు వచ్చింది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య లాంటి చిత్రాలతో తనకంటూ ఓ మార్క్ సొంతం చేసుకొన్న దేవ కట్టా దర్శకత్వలో ఈ చిత్రం ఆక్టోబర్ 1వ తేదీన రిలీజైంది. అయితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని స్క్రీన్లలో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఏ మేరకు బిజినెస్ చేసిందనే విషయాల్లోకి వెళితే..

ఏపీ రాజకీయాలపై విమర్శనాస్త్రం

ఏపీ రాజకీయాలపై విమర్శనాస్త్రం


రిపబ్లిక్ మూవీ సినిమా కథ విషయానికి వస్తే.. ఆంధ్ర ప్రదేశ్‌లో అత్యంత పాపులారిటి ఉన్న కొల్లేటి మంచినీటి సరస్సు ఎలా ఉప్పునీటి సరస్సుగా మారింది. అరుదైన పక్షులకు విడిదిగా ఉన్న ఈ సరస్సు ఎలా విషంగా మారింది. ఈ సరస్సుపై రాజకీయ నేతల వికృత క్రీడ 40 ఏళ్లపాటు ఎలా సాగిందనే పాయింట్‌తో దర్శకుడు దేవ కట్టా రిపబ్లిక్‌ను ప్రస్తుత రాజకీయాలపై సినీ విమర్శనాస్త్రంగా రూపొందించారు.

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత

అయితే రిపబ్లిక్ మూవీ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే రిలీజ్‌కు ముందు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి కావడం, చావు బతుకుల మధ్య హాస్పిటల్ చేరడంతో ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దాంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

తెలుగు రాష్ట్రాలో బిజినెస్ ఇలా..

తెలుగు రాష్ట్రాలో బిజినెస్ ఇలా..

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఏపీ తెలంగాణలో మొత్తం కలిపి ఈ చిత్రం 13 కోట్ల మేర బిజినెస్ చేసింది. నైజాం, ఆంధ్రాలోని పలు జిల్లాల హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. దాంతో రిపబ్లిక్ సినిమా బిజినెస్ క్రేజీగా మారడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఎంతంటే..

ఇక ప్రపంచవ్యాప్తంగా రిపబ్లిక్ మూవీ బిజినెస్ భారీగానే నమోదు చేసుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం హక్కులు 13 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా సుమారు 14 కోట్లకుపైగానే బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా 14.5 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీకి సిద్ధమైంది.

వరల్డ్ వైడ్‌గా 750 స్క్రీన్లలో

వరల్డ్ వైడ్‌గా 750 స్క్రీన్లలో

రిపబ్లిక్ మూవీ ఏపీలో దాదాపు 300కుపైగా థియేటర్లలో, నైజాంలో సుమారు 300 థియేటర్లలో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 750 స్క్రీన్లలో రిలీజ్ చేయడం గమనార్హం. బిజినెస్ పరంగా, అలాగే థియేటర్ల రిలీజ్ చూసుకొంటే సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బెస్ట్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

తొలి రోజు కలెక్షన్లు ఎంత రాబట్ట వచ్చంటే

తొలి రోజు కలెక్షన్లు ఎంత రాబట్ట వచ్చంటే


ఇక రిపబ్లిక్ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. అడ్వాన్స్ బుకింగ్ ఓ మోస్తారుగా నమోదైంది. తాజా సమాచారం ప్రకారం తొలి రోజు కలెక్షన్లు ఓ రేంజ్‌లోనే ఉన్నాయనేది ట్రేడ్ వర్గాల రిపోర్టు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు రూ.2 కోట్ల మేర వసూళ్లను బాక్సాఫీష్ వద్ద సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X