Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Solo Brathuke So Better రెండో రోజు కలెక్షన్లు.. బాక్సాఫీస్‌పై సాయిధరమ్ తేజ్ పంజా!
లాక్డౌన్ నిబంధనల మధ్య కూడా సాయిధరమ్ తేజ్, నభా నటేష్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ చిత్రం రెండో రోజున కూడా కలెక్షన్లు మరింత పెరగడం సినిమాకు సానుకూలంగా మారింది. రెండు రోజుల్లో సోలో బ్రతుకే సో బెటర్ ఏ మేరకు కలెక్షన్లు రాబట్టిందంటే...
పాజిటివ్ టాక్‌తో ముందుకు
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ముందుకు వెళ్లింది. తొలి రోజున రూ.4.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజున వసూళ్ల జైత్రయాత్రను కొనసాగించింది.
నైజాంలో భారీ వసూళ్లు
మెగా హీరోలకు బాక్సాఫీస్ అడ్డగా మారిన నైజాంలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజున రూ.1.84 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజున రూ.1.19 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది. ఆదివారం కూడా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఆంధ్రాలో రెండో రోజు కలెక్షన్లు
అలాగే ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో వసూళ్ల విషయానికి వస్తే.. గుంటూరు జిల్లాలో 26 లక్షలు, నెల్లూరులో 13 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 18 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 24 లక్షలు, వైజాగ్ జిల్లాలో 55 లక్షలు రాబట్టింది.
సీడెడ్‌లో స్ట్రాంగ్‌గా
ఇక సీడెడ్ విషయానికి వస్తే.. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం తొలి రోజున 86 లక్షల రూపాయలు వసూలు చేయడం తెలిసిందే. ఇక రెండో రోజున 59 లక్షల రూపాయల కలెక్ట్ చేసింది. సీడెడ్‌లో కూడా ఈ చిత్రం స్ట్రాంగ్‌గా ఉండటం మెగా బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పట్టింది.
ఓవరాల్‌గా 8 కోట్లకు చేరువగా
లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా 50 శాతం అక్యుపెన్సీతో రన్ అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం తొలి రోజున రూ.4.70 కోట్ల గ్రాస్, రెండో రోజున 3.29 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషంగా చెప్పుకొంటున్నారు. మొత్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం 7.99 కోట్లు వసూలు చేయడం లాక్డౌన్ రిలీజ్ పరంగా ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.