twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Solo Brathuke So Better రెండో రోజు కలెక్షన్లు.. బాక్సాఫీస్‌పై సాయిధరమ్ తేజ్ పంజా!

    |

    లాక్‌డౌన్ నిబంధనల మధ్య కూడా సాయిధరమ్ తేజ్, నభా నటేష్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ చిత్రం రెండో రోజున కూడా కలెక్షన్లు మరింత పెరగడం సినిమాకు సానుకూలంగా మారింది. రెండు రోజుల్లో సోలో బ్రతుకే సో బెటర్ ఏ మేరకు కలెక్షన్లు రాబట్టిందంటే...

    పాజిటివ్ టాక్‌తో ముందుకు

    పాజిటివ్ టాక్‌తో ముందుకు

    క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ముందుకు వెళ్లింది. తొలి రోజున రూ.4.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజున వసూళ్ల జైత్రయాత్రను కొనసాగించింది.

    నైజాంలో భారీ వసూళ్లు

    నైజాంలో భారీ వసూళ్లు

    మెగా హీరోలకు బాక్సాఫీస్ అడ్డగా మారిన నైజాంలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజున రూ.1.84 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజున రూ.1.19 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది. ఆదివారం కూడా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ఆంధ్రాలో రెండో రోజు కలెక్షన్లు

    ఆంధ్రాలో రెండో రోజు కలెక్షన్లు

    అలాగే ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో వసూళ్ల విషయానికి వస్తే.. గుంటూరు జిల్లాలో 26 లక్షలు, నెల్లూరులో 13 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 18 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 24 లక్షలు, వైజాగ్‌ జిల్లాలో 55 లక్షలు రాబట్టింది.

    సీడెడ్‌లో స్ట్రాంగ్‌గా

    సీడెడ్‌లో స్ట్రాంగ్‌గా

    ఇక సీడెడ్ విషయానికి వస్తే.. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం తొలి రోజున 86 లక్షల రూపాయలు వసూలు చేయడం తెలిసిందే. ఇక రెండో రోజున 59 లక్షల రూపాయల కలెక్ట్ చేసింది. సీడెడ్‌లో కూడా ఈ చిత్రం స్ట్రాంగ్‌గా ఉండటం మెగా బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పట్టింది.

    ఓవరాల్‌గా 8 కోట్లకు చేరువగా

    ఓవరాల్‌గా 8 కోట్లకు చేరువగా

    లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా 50 శాతం అక్యుపెన్సీతో రన్ అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం తొలి రోజున రూ.4.70 కోట్ల గ్రాస్, రెండో రోజున 3.29 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషంగా చెప్పుకొంటున్నారు. మొత్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం 7.99 కోట్లు వసూలు చేయడం లాక్‌డౌన్ రిలీజ్ పరంగా ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

    English summary
    Solo Brathuke So Better box office report: Mega Hero Sai Dharam Tej's movie is getting good response at Box office. Solo brathuke So better is register record collection after lockdown release. It collected 7.99 crores gross collections for day 2 in Telugu states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X