Virupaksha 12 Days Collections: విరూపాక్ష పెను సంచలనం.. బాలయ్య రికార్డు బ్రేక్.. వామ్మో అన్ని కోట్లా

పేరుకు మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినా.. తనదైన శైలి సినిమాలు, విలక్షణమైన నటనతో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకుని దూసుకుపోతోన్నాడు సాయి ధరమ్ తేజ్. ఆ మధ్య వరుస హిట్లు కొట్టిన అతడు.. 'రిపబ్లిక్'తో సక్సెస్ కాలేకపోయాడు. ఆ వెంటనే యాక్సిడెంట్ వల్ల గ్యాప్ తీసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో మళ్లీ సాయి తేజ్'విరూపాక్ష' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్రర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' మూవీ 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

భయపెట్టే కథతో వచ్చిన హీరో: సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీనే 'విరూపాక్ష'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చారు.

Virupaksha 12 Days Collections:

విరూపాక్ష బిజినెస్ వివరాలివే : సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది.

Virupaksha 12 Days Collections:

12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: ఆంధ్రా, తెలంగాణలో 'విరూపాక్ష' మూవీకి 12వ రోజు వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 76 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

12 రోజులకూ ఎంత వచ్చింది? : తెలుగు రాష్ట్రాల్లో 'విరూపాక్ష' మూవీకి 12 రోజుల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 14.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.54 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.28 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.61 కోట్లు, గుంటూరులో రూ. 2.18 కోట్లు, కృష్ణాలో రూ. 2.14 కోట్లు, నెల్లూరులో రూ. 1.05 కోట్లతో కలిపి.. రూ. 32.87 కోట్లు షేర్, రూ. 57.30 కోట్లు గ్రాస్ వసూలైంది.

Virupaksha 12 Days Collections:

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది : 12 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 32.87 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.66 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.10 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లోనే రూ. 40.63 కోట్లు షేర్‌, రూ. 73.95 కోట్లు గ్రాస్ రాబట్టింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత? : హర్రర్ కథతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లోనే దీనికి రూ. 40.63 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.63 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసేసుకుంది.

Virupaksha 12 Days Collections:

మరో సంచలనం.. టాప్ 2లో : సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' 12 రోజుల్లోనే రూ. 40 కోట్లు షేర్ మార్కును దాటేసి మరో సంచలన రికార్డును కొట్టింది. అలాగే, వరుసగా 11 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటి అంత కంటే ఎక్కువ సాధించింది. తద్వారా ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో 'వీర సింహా రెడ్డి' (8 రోజులు) రికార్డును దాటి రెండో స్థానానికి చేరింది. ఇందులో 'వాల్తేరు వీరయ్య' టాప్‌లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X