Virupaksha 13 Days Collections: వసూళ్లు డౌన్.. 13 రోజుల్లో రికార్డు స్థాయిలో.. అన్ని కోట్ల లాభాలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న ఎంతో మంది యంగ్ హీరోలు సందడి చేస్తోన్నారు. అందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వచ్చిన అతడు.. కష్టపడేతత్వంతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఫలితంగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుని దూసుకుపోతోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు అతడు 'విరూపాక్ష' అనే సినిమాతో వచ్చాడు. ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. అయితే, రెండు రోజులగా డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' 13 రోజుల రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!

తొలిసారి సాయి తేజ్ ప్రయోగం:సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రమే 'విరూపాక్ష'. కార్తీక్ దండు రూపొందించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 13 Days Worldwide Official Collections

విరూపాక్ష బిజినెస్ వివరాలివే:హర్రర్ జోనర్‌లో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 13.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ అయింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 13 Days Worldwide Official Collections

13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:13వ రోజు ఆంధ్రా, తెలంగాణలో 'విరూపాక్ష' మూవీకి వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 58 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 13 Days Worldwide Official Collections

13 రోజులకూ ఎంత వచ్చింది?:తెలుగు రాష్ట్రాల్లో 'విరూపాక్ష' మూవీకి 13 రోజుల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 14.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.61 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.31 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.64 కోట్లు, గుంటూరులో రూ. 2.21 కోట్లు, కృష్ణాలో రూ. 2.18 కోట్లు, నెల్లూరులో రూ. 1.08 కోట్లతో కలిపి.. రూ. 33.45 కోట్లు షేర్, రూ. 58.30 కోట్లు గ్రాస్ వసూలైంది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 13 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఏపీ, తెలంగాణలో 13 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 33.45 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.22 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లోనే రూ. 41.39 కోట్లు షేర్‌, రూ. 75.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 13 Days Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లోనే దీనికి రూ. 41.39 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 18.39 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X