Virupaksha 15 Days Collections: వేరే భాషల్లోనూ భారీగా.. విరూపాక్ష సెన్సేషన్.. నిర్మాతకు జాక్‌పాట్
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చి.. ఆరంభంలోనే తనలోని టాలెంట్లను బయటకు తెచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఫ్యాన్‌బేస్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. యాక్సిడెంట్ తర్వాత 'విరూపాక్ష' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు స్పందన భారీగానే వస్తోంది. దీంతో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. అయితే, ఈ వారంలో క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 15 రోజుల రిపోర్టును చూద్దామా!

విరూపాక్ష అంటూ వచ్చిన హీరో: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన చిత్రమే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: హర్రర్ జోనర్‌లో రూపొందిన 'విరూపాక్ష'కు నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ అయింది.
15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: తెలుగు రాష్ట్రాల్లో 'విరూపాక్ష' మూవీకి 15వ రోజు వసూళ్లు కాస్త తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 41 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

15 రోజులకూ ఎంత వచ్చింది?: ఏపీ, తెలంగాణలో 'విరూపాక్ష' మూవీకి 15 రోజుల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 14.74 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.37 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.69 కోట్లు, గుంటూరులో రూ. 2.27 కోట్లు, కృష్ణాలో రూ. 2.24 కోట్లు, నెల్లూరులో రూ. 1.12 కోట్లతో కలిపి.. రూ. 34.32 కోట్లు షేర్, రూ. 59.80 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 15 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 34.32 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.78 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.36 కోట్లు, వేరే భాషల్లో (మే 5 నుంచి) రూ. 30 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లోనే రూ. 42.76 కోట్లు షేర్, రూ. 83 కోట్లు గ్రాస్ వరకూ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: భయపెట్టే కథతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లోనే దీనికి రూ. 42.76 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 19.76 కోట్లు లాభాలతో నిర్మాతలు జాక్‌పాట్‌ను కొట్టేశారు.


Click it and Unblock the Notifications











