Virupaksha 16 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. సాయి తేజ్ సంచలన రికార్డు.. ఈ మధ్య ఇదే టాప్

టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులోనే కొందరు ప్రత్యేకమైన గుర్తింపుతో మంచి పేరు తెచ్చుకుని దూసుకుపోతోన్నారు. వారిలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అతడు.. తనలోని ప్రతిభతో సత్తా చాటుతోన్నాడు. ఫలితంగా తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే 'విరూపాక్ష' అనే సినిమాతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు పలు రికార్డులు కూడా బద్దలైపోయాయి. మరి ఈ మూవీ 16 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

Sai Dharam Tej Starrer Virupaksha Movie 16 Days Worldwide Official Collections

హర్రర్ మూవీతో వచ్చిన హీరో: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలను పోషించారు.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 16 Days Worldwide Official Collections

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 16 Days Worldwide Official Collections

16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 16వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 'విరూపాక్ష' మూవీకి వసూళ్లు బాగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 29 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 65 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

16 రోజులకూ ఎంత వచ్చింది?: ఏపీ, తెలంగాణలో 16 రోజుల్లో 'విరూపాక్ష' మూవీకి భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 15.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.73 కోట్లు, గుంటూరులో రూ. 2.30 కోట్లు, కృష్ణాలో రూ. 2.28 కోట్లు, నెల్లూరులో రూ. 1.14 కోట్లతో కలిపి.. రూ. 34.97 కోట్లు షేర్, రూ. 60.90 కోట్లు గ్రాస్ వసూలైంది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 16 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఆంధ్రా, తెలంగాణలో 16 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 34.97 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.41 కోట్లు, వేరే భాషల్లో (మే 5 నుంచి) రూ. 50 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 16 రోజుల్లోనే రూ. 43.70 కోట్లు షేర్‌, రూ. 85 కోట్లు గ్రాస్ వరకూ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: హర్రర్ స్టోరీతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లోనే దీనికి రూ. 43.70 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.70 కోట్లు లాభాలతో నిర్మాతలు జాక్‌పాట్‌ను కొట్టేశారు.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 16 Days Worldwide Official Collections

సాయి తేజ్ సంచలన రికార్డు: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. మధ్యలో కాస్త డౌన్ అయినా మళ్లీ శనివారం నుంచి ఈ చిత్రం పుంజుకుంది. దీనికితోడు వేరే భాషల్లోనూ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలా ఈ సినిమా ఇప్పటికే రూ. 43 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అలాగే రూ. 20 కోట్ల లాభాల మార్కును చేరి సంచలన రికార్డును సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X