Virupaksha 17 Days Collections: విరూపాక్షకు సండే లక్.. భారీ వసూళ్లతో షాకిస్తూ.. అన్ని కోట్లా లాభాలా!
మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది యంగ్ హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు తమదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నారు. అందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకడు. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో వస్తున్న అతడు.. తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సాయి తేజ్ 'విరూపాక్ష' అనే సినిమాతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు పలు రికార్డులు నమోదు అవుతున్నాయి. మరి ఈ మూవీ 17 రోజుల రిపోర్టుపై మీరూ లుక్కేయండి!

విరూపాక్ష అంటూ వచ్చిన సాయి: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: హర్రర్ కాన్సెప్టుతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్ అయింది.

17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:తెలుగు రాష్ట్రాల్లో 17వ రోజు 'విరూపాక్ష' మూవీకి వసూళ్లు బాగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 32 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 85 లక్షలు షేర్, రూ. 1.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
17 రోజులకూ ఎంత వచ్చింది?:17 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'విరూపాక్ష' మూవీకి భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 15.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.03 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.77 కోట్లు, గుంటూరులో రూ. 2.35 కోట్లు, కృష్ణాలో రూ. 2.35 కోట్లు, నెల్లూరులో రూ. 1.17 కోట్లతో కలిపి.. రూ. 35.82 కోట్లు షేర్, రూ. 62.40 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:తెలుగులో 17 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 35.82 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.41 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 55 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల్లోనే రూ. 44.97 కోట్లు షేర్, రూ. 87.50 కోట్లు గ్రాస్ వరకూ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లోనే దీనికి రూ. 44.97 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.97 కోట్లు లాభాలతో నిర్మాతలు జాక్‌పాట్‌ను కొట్టేశారు.


Click it and Unblock the Notifications











