Virupaksha 1st Week Collections: 23 కోట్ల టార్గెట్.. వారంలోనే సంచలనం.. లాభాలతో సాయి తేజ్ రికార్డు
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. వారిలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తోన్న అతడు.. యాక్సిడెంట్ వల్ల కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక, ఇప్పుడు ఈ మెగా హీరో 'విరూపాక్ష' అనే సినిమాతో వచ్చాడు. హర్రర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' మూవీ 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
భయపెట్టే కథతో వచ్చిన హీరో:సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీనే 'విరూపాక్ష'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే:సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:ఆంధ్రా, తెలంగాణలో 7వ రోజూ 'విరూపాక్ష' మూవీకి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 69 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 1.50 కోట్లు షేర్, రూ. 2.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

7 రోజులకూ ఎంత వచ్చింది?:తెలుగు రాష్ట్రాల్లో వారంలో 'విరూపాక్ష' మూవీకి భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.76 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, గుంటూరులో రూ. 1.69 కోట్లు, కృష్ణాలో రూ. 1.63 కోట్లు, నెల్లూరులో రూ. 80 లక్షలతో కలిపి.. రూ. 25.11 కోట్లు షేర్, రూ. 43.40 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:వారం రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 25.11 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.35 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లోనే రూ. 31.66 కోట్లు షేర్, రూ. 57.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 31.66 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 8.66 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసేసుకుంది.

సాయి తేజ్ కెరీర్‌లో బెస్ట్ వీక్:సాయి ధరమ్ తేజ్ నటించిన హర్రర్ థ్రిల్లర్ 'విరూపాక్ష' మూవీకి భారీ స్థాయిలోనే స్పందన దక్కుతోంది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధించిన సూపర్ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో ఫస్ట్ వీక్‌లోనే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. తద్వారా సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే వారంలోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా ఇది రికార్డును సాధించింది.


Click it and Unblock the Notifications











