Virupaksha 2 Days Collections: విరూపాక్ష సంచలనం.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు.. పవన్ రికార్డు బ్రేక్

మెగా మేనల్లుడిగా పరిచయమైనా.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తాను నిరూపించుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటోన్న అతడు.. గత ఏడాది 'రిపబ్లిక్'తో ఎదురుదెబ్బను తిన్నాడు.

ఆ తర్వాత యాక్సిడెంట్ అయినా కొద్ది రోజులకు కోలుకున్న సాయి తేజ్ 'విరూపాక్ష' అనే సినిమాను చేశాడు. హర్రర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి మరి!

Sai Dharam Tej Starrer Virupaksha Movie 2 Days Worldwide Official Collections

విరూపాక్షగా వచ్చిన సాయి తేజ్: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కాంబోలో తెరకెక్కిన సినిమానే 'విరూపాక్ష'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: సాయి తేజ్ - సంయుక్త నటించిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ అయింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 2 Days Worldwide Official Collections

2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 'విరూపాక్ష' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజూ భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 89 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 75 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి.. రూ. 5.80 కోట్లు షేర్, రూ. 9.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ ఎంత వచ్చింది?: 'విరూపాక్ష' మూవీకి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.53 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.43 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 75 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 66 లక్షలు, గుంటూరులో రూ. 81 లక్షలు, కృష్ణాలో రూ. 70 లక్షలు, నెల్లూరులో రూ. 38 లక్షలతో కలిపి.. రూ. 10.59 కోట్లు షేర్, రూ. 18.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో 2 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 10.59 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.21 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లోనే రూ. 13.65 కోట్లు షేర్‌, రూ. 24.60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 2 Days Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?: హర్రర్ స్టోరీతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 13.65 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 9.35 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

పవన్ రికార్డు బ్రేక్.. మూడో ప్లేస్: క్రేజీ స్టోరీతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్సే దక్కుతోంది. దీంతో 2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.80 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' రికార్డు (5.76 కోట్లు) రికార్డును ఇది బ్రేక్ చేసింది. అలాగే, మీడియం రేంజ్ చిత్రాల్లో మూడో స్థానానికి చేరింది. దీనికంటే ముందు ఉప్పెన, దసరా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X