Virupaksha 2 Weeks Collections: 23 కోట్ల టార్గెట్.. 2 వారాల్లో సంచలన వసూళ్లు.. లాభాలతో టాప్ రికార్డు

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, గ్రేస్ ఇలా అన్నింట్లోనూ రాణించడంతో పాటు సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను తనదైన రీతిలో అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. బ్యాగ్రౌండ్ ఉన్నా కష్టపడుతూ తనలోని నటుడిని మరింతగా బయటకు తీసుకు వస్తున్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న వెంటనే ఈ మెగా హీరో 'విరూపాక్ష' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' 2 వారాలకు ఎంత వసూళ్లు సాధించిందన్న రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!

హర్రర్ స్టోరీతో వచ్చిన మెగా హీరో:సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'విరూపాక్ష'. కార్తీక్ దండు రూపొందించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 2 Weeks Worldwide Official Collections

విరూపాక్ష బిజినెస్ వివరాలివే:సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన 'విరూపాక్ష'కు నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:ఆంధ్రా, తెలంగాణలో 'విరూపాక్ష' మూవీకి 14వ రోజు వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 15 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 46 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 2 Weeks Worldwide Official Collections

2 వారాలకూ ఎంత వచ్చింది?:తెలుగు రాష్ట్రాల్లో 'విరూపాక్ష' మూవీకి 2 వారాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 14.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.66 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.34 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.66 కోట్లు, గుంటూరులో రూ. 2.24 కోట్లు, కృష్ణాలో రూ. 2.21 కోట్లు, నెల్లూరులో రూ. 1.10 కోట్లతో కలిపి.. రూ. 33.91 కోట్లు షేర్, రూ. 59.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 2 Weeks Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:2 వారాల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 33.91 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.30 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 14 రోజుల్లోనే రూ. 41.96 కోట్లు షేర్‌, రూ. 82 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 2 Weeks Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:హర్రర్ కాన్సెప్టుతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లోనే దీనికి రూ. 41.96 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 18.96 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసేసుకుంది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 2 Weeks Worldwide Official Collections

సాయి తేజ్ సంచలన రికార్డు:సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' చిత్రానికి ఆరంభం నుంచే అదిరిపోయే వసూళ్లు దక్కుతోన్నాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడో బ్రేక్ ఈవెన్‌ను దాటేసి లాభాల బాట పట్టింది. ఇలా రెండు వారాల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 19 కోట్లు వరకూ లాభాలను అందుకుంది. తద్వారా ఈ మార్కును చేరుకున్న సాయి తేజ్ చిత్రంగా టాప్ ప్లేసుకు చేరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X