Virupaksha Collections: హిందీ, తమిళంలో ఢమాల్.. ఈ మధ్య కాలంలో ఇదే ఘోరం.. తెలుగులో లాభాలు ఎంతంటే!

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయం అయినా.. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో విశేషమైన గుర్తింపును, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. దీనికితోడు ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత 'విరూపాక్ష' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు దక్కాయి. అయితే, హిందీ, తమిళం, మలయాళంలో మాత్రం వరుస షాక్‌లు తగులుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' మూవీ అన్ని భాషల్లో ఇప్పటి వరకూ ఎంత రాబట్టిందో చూడండి!

విరూపాక్షగా భయపెట్టేశారుగా:సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు పోషించారు.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 20 Days Worldwide Official Collections

విరూపాక్ష బిజినెస్ వివరాలివే:భయపెట్టే కథతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్ జరిగింది.

20వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:సాయి ధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన 'విరూపాక్ష' చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. ఇలా ఈ చిత్రం వారంలోనే టార్గెట్‌ను చేరుకుని లాభాల బాటలో పయనిస్తోంది. అయితే, ఇప్పుడు వసూళ్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే 20వ రోజు దీనికి రూ. 21 లక్షలే వచ్చాయి.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 20 Days Worldwide Official Collections

20 రోజులకూ ఎంత వచ్చింది?:ఏపీ, తెలంగాణలో 20 రోజుల్లో 'విరూపాక్ష' మూవీకి భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 15.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.44 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.82 కోట్లు, గుంటూరులో రూ. 2.42 కోట్లు, కృష్ణాలో రూ. 2.42 కోట్లు, నెల్లూరులో రూ. 1.20 కోట్లతో కలిపి.. రూ. 36.68 కోట్లు షేర్, రూ. 64.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 20 Days Worldwide Official Collections

హిందీ, తమిళంలో ఘోరంగా:వాస్తవానికి 'విరూపాక్ష' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. ఇక్కడ హిట్ అవడంతో మే 5వ తేదీన హిందీ, తమిళం, మలయాళంలోనూ తీసుకొచ్చారు. కానీ, ఆ భాషల్లో ఇది సక్సెస్ కాలేదు. దీంతో కలెక్షన్లు పెద్దగా రావట్లేదు. ఈ క్రమంలోనే బుధవారం అక్కడ కేవలం రూ. 1 లక్షలే రాబట్టింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 20 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:20 రోజుల్లో తెలుగులో భారీ స్థాయిలో రూ. 36.68 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.82 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 57 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 20 రోజుల్లోనే రూ. 45.97 కోట్లు షేర్‌, రూ. 89 కోట్లు గ్రాస్ వరకూ వసూలు చేసింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 20 Days Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:క్రేజీ కాంబోలో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 20 రోజుల్లోనే దీనికి రూ. 45.97 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 22.97 కోట్లు లాభాలతో నిర్మాతలు జాక్‌పాట్‌ను కొట్టేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X