Virupaksha Collections: సాయి తేజ్‌కు జీరో దెబ్బ.. 22 రోజుల్లో మాత్రం కేక.. ఇక్కడ లాభం అక్కడ నష్టాలు

సాయి ధరమ్ తేజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ కుర్రాడు సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అదే సమయంలో మంచి మంచి చిత్రాలతో తన రేంజ్‌ను ఇంకా పెంచుకుంటూనే ఉన్నాడు. గత ఏడాది యాక్సిడెంట్‌కు గురైన తర్వాత గ్యాప్ తీసుకున్న సాయి తేజ్.. ఇటీవలే 'విరూపాక్ష' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. అయితే, వేరే భాషల్లో మాత్రం నష్టాల బాటలో వెళ్తోంది. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' ఇప్పటి వరకూ ఎంత రాబట్టిందో చూడండి!

విరూపాక్షగా వచ్చేసిన సాయి తేజ్ : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు.

 virupaksha

విరూపాక్ష బిజినెస్ వివరాలివే : క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్ జరిగింది.

 virupaksha

22వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది : సాయి ధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన 'విరూపాక్ష' చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఈ చిత్రం వారంలోనే టార్గెట్‌ను చేరి లాభాల బాటలో నడుస్తోంది అయితే, ఇప్పుడు వసూళ్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే 22వ రోజు దీనికి తెలుగులో రూ. 17 లక్షలే కలెక్ట్ అయ్యాయి.

 virupaksha

22 రోజులకూ ఎంత వచ్చింది : 22 రోజుల్లో 'విరూపాక్ష' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 15.84 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.18 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.57 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.84 కోట్లు, గుంటూరులో రూ. 2.46 కోట్లు, కృష్ణాలో రూ. 2.46 కోట్లు, నెల్లూరులో రూ. 1.22 కోట్లతో కలిపి.. రూ. 37.05 కోట్లు షేర్, రూ. 64.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

 virupaksha

హిందీ, తమిళంలో జీరో షేర్‌తో : అన్ని వర్గాల వాళ్లకూ కనెక్ట్ అయ్యే కాన్సెప్టుతో వచ్చిన 'విరూపాక్ష' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. ఇక్కడ హిట్ అవడంతో మే 5వ తేదీన హిందీ, తమిళం, మలయాళంలోనూ తీసుకొచ్చారు. కానీ, ఆ భాషల్లో ఇది సక్సెస్ కాలేదు. ఇక, శుక్రవారం ఆ భాషల్లో జీరో షేర్‌ వచ్చింది.

 virupaksha

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది : తెలుగులో 22 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 37.05 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.91 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.84 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 57 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 22 రోజుల్లోనే రూ. 46.37 కోట్లు షేర్‌, రూ. 90.40 కోట్లు గ్రాస్ వరకూ వసూలు చేసింది.

 virupaksha

మూవీకి టార్గెట్.. లాభం ఎంత : హర్రర్ స్టోరీతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.21 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 22 రోజుల్లోనే దీనికి రూ. 46.37 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.37 కోట్లు లాభాలు వచ్చాయి. కానీ, వేరే భాషల్లో నష్టాలే మిగిలాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X