Virupaksha Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. అక్కడ మాత్రం జీరోనే.. లాభాలు ఎంతో తెలిస్తే!
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనలోని అన్ని టాలెంట్లనూ నిరూపించుకుని.. చాలా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ను దక్కించుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'విరూపాక్ష' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. అయితే, వేరే భాషల్లో మాత్రం నిరాశ పరుస్తోంది. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' వసూళ్లను చూద్దామా!
విరూపాక్షగా మారిన సాయి తేజ్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చాడు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: హర్రర్ కాన్సెప్టుతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్ అయింది.

23వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' చిత్రానికి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఈ చిత్రం వారంలోనే టార్గెట్‌ను చేరి లాభాల బాటలో నడుస్తోంది అయితే, ఇప్పుడు వసూళ్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. కానీ, 23వ రోజు కాస్త పెరిగాయి. దీంతో దీనికి తెలుగులో రూ. 22 లక్షలు కలెక్ట్ అయ్యాయి.
23 రోజులకూ ఎంత వచ్చింది? : 'విరూపాక్ష' మూవీకి 23 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 15.91 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.59 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.86 కోట్లు, గుంటూరులో రూ. 2.48 కోట్లు, కృష్ణాలో రూ. 2.48 కోట్లు, నెల్లూరులో రూ. 1.23 కోట్లతో కలిపి.. రూ. 37.27 కోట్లు షేర్, రూ. 65.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

హిందీ, తమిళంలో జీరో షేర్‌తో: యూనివర్షల్ హర్రర్ కాన్సెప్టుతో రూపొందిన 'విరూపాక్ష' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. ఇక్కడ హిట్ అవడంతో మే 5వ తేదీన హిందీ, తమిళం, మలయాళంలోనూ తీసుకొచ్చారు. కానీ, ఆ భాషల్లో ఇది సక్సెస్ కాలేదు. ఇక, శనివారం కూడా ఆ భాషల్లో జీరో షేర్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 23 రోజుల్లో తెలుగులో భారీ స్థాయిలో రూ. 37.27 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.92 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.85 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 57 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 23 రోజుల్లోనే రూ. 46.61 కోట్లు షేర్, రూ. 90.80 కోట్లు గ్రాస్ వరకూ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: క్రేజీ కాంబోలో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లోనే దీనికి రూ. 46.61 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.61 కోట్లు లాభాలు వచ్చాయి. కానీ, వేరే భాషల్లో నష్టాలే మిగిలాయి.


Click it and Unblock the Notifications











