Virupaksha Collections: కలిసొచ్చిన సండే.. బిజినెస్‌కు డబుల్ లాభాలు.. అక్కడ హ్యూజ్ డిజాస్టర్
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపుతో ముందుకు సాగుతోన్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో అలరిస్తోన్న ఈ మెగా హీరో.. ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'విరూపాక్ష' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. అయితే, వేరే భాషల్లో మాత్రం వరుస దెబ్బలు తగులుతున్నాయి. మరి 'విరూపాక్ష' వసూళ్లను చూద్దామా!
విరూపాక్షగా భయపెట్టేశాడుగా: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కలయికలో రూపొందిన చిత్రమే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చాడు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: భయపెట్టే కథతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్ జరిగింది.
24వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: సాయి ధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన 'విరూపాక్ష' చిత్రానికి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఈ చిత్రం వారంలోనే టార్గెట్‌ను చేరి లాభాల బాటలో వెళ్తోంది. అయితే, ఇప్పుడు వసూళ్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. కానీ, 24వ రోజు మళ్లీ పెరిగాయి. దీంతో దీనికి తెలుగులో రూ. 27 లక్షలు దక్కాయి.

24 రోజులకూ ఎంత వచ్చింది?: 24 రోజుల్లో 'విరూపాక్ష' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.61 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.88 కోట్లు, గుంటూరులో రూ. 2.51 కోట్లు, కృష్ణాలో రూ. 2.51 కోట్లు, నెల్లూరులో రూ. 1.25 కోట్లతో కలిపి.. రూ. 37.54 కోట్లు షేర్, రూ. 65.70 కోట్లు గ్రాస్ వసూలైంది.
హిందీ, తమిళంలో జీరో షేర్‌తో: అన్ని భాషలకూ సరిపోయే కథతో రూపొందిన 'విరూపాక్ష' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. ఇక్కడ హిట్ అవడంతో మే 5వ తేదీన హిందీ, తమిళం, మలయాళంలోనూ తీసుకొచ్చారు. కానీ, ఆ భాషల్లో ఇది వరుసగా నాలుగు రోజుల నుంచి జీరో షేర్‌తో డిజాస్టర్ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగులో 24 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 37.54 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.93 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.86 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 57 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24 రోజుల్లోనే రూ. 46.90 కోట్లు షేర్, రూ. 91.50 కోట్లు గ్రాస్ వరకూ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: హర్రర్ కాన్సెప్టుతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 24 రోజుల్లోనే దీనికి రూ. 46.90 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.90 కోట్లు లాభాలు వచ్చాయి. కానీ, వేరే భాషల్లో నష్టాలే మిగిలాయి.


Click it and Unblock the Notifications











