Virupaksha Collections: వసూళ్లు మరింత డౌన్.. 26 రోజుల్లో మాత్రం రికార్డు.. 80 లక్షలు వస్తే చరిత్రే
అదిరిపోయే నటన, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన మార్కుకు చూపిస్తూ దూసుకుపోతోన్నాడు మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే ప్రేక్షకులను మెప్పించిన అతడు.. సుప్రీమ్ హీరో అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఫలితంగా మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సాయి తేజ్ 'విరూపాక్ష' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. అయితే, వేరే భాషల్లో మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. మరి 'విరూపాక్ష' 26 రోజుల వసూళ్లను చూద్దామా!
విరూపాక్షగా వచ్చిన సాయి తేజ్:సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీనే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే:హర్రర్ స్టోరీతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్ అయింది.

26వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:సాయి ధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ కలిసి నటించిన 'విరూపాక్ష' చిత్రానికి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఈ చిత్రం వారంలోనే టార్గెట్‌ను చేరి లాభాల బాటలో వెళ్తోంది. అయితే, ఇప్పుడు వసూళ్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ క్రమంలో 26వ రోజు దీనికి తెలుగులో రూ. 13 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

26 రోజులకూ ఎంత వచ్చింది?:'విరూపాక్ష' మూవీకి 26 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.28 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.90 కోట్లు, గుంటూరులో రూ. 2.53 కోట్లు, కృష్ణాలో రూ. 2.54 కోట్లు, నెల్లూరులో రూ. 1.27 కోట్లతో కలిపి.. రూ. 37.81 కోట్లు షేర్, రూ. 66.20 కోట్లు గ్రాస్ వసూలైంది.
హిందీ, తమిళంలో క్లోజైందిగా:యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందిన 'విరూపాక్ష' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. ఇక్కడ హిట్ అవడంతో మే 5వ తేదీన హిందీ, తమిళం, మలయాళంలోనూ తీసుకొచ్చారు. కానీ, ఆ భాషల్లో ఇది నాలుగు రోజులకే చాప చుట్టేసింది. ఫలితంగా అక్కడ రన్ క్లోజ్ అయిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:26 రోజుల్లో తెలుగులో భారీ స్థాయిలో రూ. 37.81 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.86 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 57 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 26 రోజుల్లోనే రూ. 47.19 కోట్లు షేర్, రూ. 92.00 కోట్లు గ్రాస్ వరకూ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 26 రోజుల్లోనే దీనికి రూ. 47.19 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.19 కోట్లు లాభాలు వచ్చాయి. మరో రూ. 81 లక్షలు వస్తే రూ. 25 కోట్లు లాభాలతో చరిత్ర సృష్టిస్తుంది.


Click it and Unblock the Notifications











