Virupaksha Day 3 Collections: మూడవ రోజు కూడా అదే జోరు.. మెగా హీరో మూవీకి కలెక్షన్స్ ఎంతంటే?
సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు కూడా కలెక్షన్స్ మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందించిన సినిమాగా విరూపాక్ష నిలిచింది. అయితే ఈ సినిమా మూడవ రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకోబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమాకు ఎంత కలెక్షన్స్ రాబోతున్నాయి అనే వివరాల్లోకి వెళితే..
విరూపాక్ష బిజినెస్ వివరాలు..:సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు విడుదలకు ముందు పెద్దగా హైప్ అయితే క్రియేట్ కాలేదు. కేవలం ట్రైలర్ మాత్రమే అంచనాలను పెంచింది. ఇక సినిమా కూడా సరికొత్తగా హారర్ త్రిల్లర్ జానర్ కావడంతో జనాలు ఈ సినిమాను చూడడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు అని నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మంచి బిజినెస్ డీల్స్ అయితే సెట్ చేసుకున్నారు. ఇక మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22.20 కోట్ల బిజినెస్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లకు ఫిక్స్ అయింది.

రెండు రోజుల కలెక్షన్స్:విరూపాక్ష సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకోవడంతో సాయంత్రానికి చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోగా రెండవ రోజు 5.80 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుని మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా ఏపీ నైజంలో 10.59 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
థియేట్రికల్ ఆక్యుపెన్సీ:ఇక మూడవ రోజు ఆదివారం కావడంతో సినిమాకు మరింత ఉపయోగపడింది. ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ ఆదివారం రోజు ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. ఉదయం షోలకు 44.48 ధియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కాగా మధ్యాహ్నం షోలకు 70 శాతానికి పైగా నమోదయింది. ఇక సాయంత్రం షోలకు కూడా ఇంకాస్త పెరుగుతూ 71.87 శాతానికి నమోదు కాగా సాయంత్రం షోలకు కూడా దాదాపు అదే తరహాలో ఆక్యుపెన్సి కనిపించింది.

మూడవ రోజు కలెక్షన్స్:ఈ సినిమా మూడవ రోజు ఊహించిన విధంగా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రోజు విరూపాక్ష సినిమా 5.50 కోట్ల నుంచి 6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి రెండు రోజుల కంటే మూడవ రోజు ఏ మాత్రం తక్కువ కాకుండా విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ సొంతం చేసుకుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా:ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులలో ఈ సినిమా 7.2 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకునే అవకాశం ఉంది. వీకెండ్ కాబట్టి సినిమాకు బాగానే హెల్ప్ అయిపోయింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు దగ్గర అయ్యేలా మొత్తంగా దాదాపు 20 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సోమవారం నుంచి కూడా స్టాండర్డ్ గా కలెక్షన్స్ అందితే మాత్రం ప్రాఫిట్ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. చూడాలి మరి విరూపాక్ష ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో.


Click it and Unblock the Notifications











