Virupaksha 3 Days Collections: విరూపాక్ష ఊచకోత.. అప్పుడే అన్ని కోట్లు.. పవన్, మహేశ్ రికార్డు బ్రేక్
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. క్రమంగా స్టార్‌గా ఎదుగుతోన్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేసిన అతడు.. యాక్సిడెంట్ వల్ల కాస్త విరామం తీసుకున్నాడు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే ఈ మెగా హీరో 'విరూపాక్ష' అనే సినిమాను చేశాడు. హర్రర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!
విరూపాక్షగా సాయి తేజ్ ఎంట్రీ:మెగా హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కలయికలో రూపొందిన సినిమానే 'విరూపాక్ష'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే:సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది.
3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజూ 'విరూపాక్ష' మూవీకి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 88 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 38 లక్షలు, కృష్ణాలో రూ. 40 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలిపి.. రూ. 5.77 కోట్లు షేర్, రూ. 9.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకూ ఎంత వచ్చింది?:3 రోజుల్లో 'విరూపాక్ష' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.05 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.10 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు, గుంటూరులో రూ. 1.19 కోట్లు, కృష్ణాలో రూ. 1.10 కోట్లు, నెల్లూరులో రూ. 56 లక్షలతో కలిపి.. రూ. 16.36 కోట్లు షేర్, రూ. 27.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 16.36 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.41 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.05 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ. 20.82 కోట్లు షేర్, రూ. 37.00 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 20.82 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.18 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.
ఆ హీరోల రికార్డులు బ్రేక్ చేసి:హర్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన 'విరూపాక్ష' మూవీకి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే దక్కుతోంది. దీంతో 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.77 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' (5.61 కోట్లు), 'శ్రీమంతుడు' (5.51 కోట్లు), 'జై లవ కుశ' (5.45 కోట్లు) రికార్డులను ఇది బ్రేక్ చేసింది. అలాగే, మీడియం రేంజ్ చిత్రాల్లో టాప్ 5కి చేరుకుంది.


Click it and Unblock the Notifications











