Virupaksha Collections: హిందీ, తమిళంలో జీరో.. సాయి తేజ్‌కు షాక్.. 3 వారాల్లోనే తెలుగులో అన్ని కోట్లు

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. దీనికితోడు ఈ మధ్య కాలంలో చాలా విజయాలను అందుకున్న అతడు.. యాక్సిడెంట్ వల్ల గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ ఇటీవలే సాయి తేజ్ 'విరూపాక్ష' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు దక్కాయి. అయితే, హిందీ, తమిళం, మలయాళంలో మాత్రం బిగ్ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' ఇప్పటి వరకూ ఎంత రాబట్టిందో చూడండి!

విరూపాక్షగా ఎంటరైన సాయి తేజ్:మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో కార్తీక్ దండు తెరకెక్కించిన సినిమానే 'విరూపాక్ష'. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 3 Weeks Worldwide Official Collections

విరూపాక్ష బిజినెస్ వివరాలివే:హర్రర్ స్టోరీతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు బిజినెస్ అయింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 3 Weeks Worldwide Official Collections

21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:సాయి ధరమ్ తేజ్ - సంయుక్త మీనన్ జోడీగా చేసిన 'విరూపాక్ష' చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగా దీనికి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. ఇలా ఈ చిత్రం వారంలోనే టార్గెట్‌ను చేరి ప్రాఫిట్స్‌ను అందుకుంటోంది. అయితే, ఇప్పుడు వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ క్రమంలోనే 21వ రోజు దీనికి తెలుగులో రూ. 20 లక్షలే వచ్చాయి.

3 వారాలకూ ఎంత వచ్చింది?:ఏపీ, తెలంగాణలో 3 వారాల్లో 'విరూపాక్ష' మూవీకి భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 15.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.47 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.55 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.83 కోట్లు, గుంటూరులో రూ. 2.44 కోట్లు, కృష్ణాలో రూ. 2.44 కోట్లు, నెల్లూరులో రూ. 1.21 కోట్లతో కలిపి.. రూ. 36.88 కోట్లు షేర్, రూ. 64.40 కోట్లు గ్రాస్ వసూలైంది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 3 Weeks Worldwide Official Collections

హిందీ, తమిళంలో ఘోరంగా:యూనివర్శల్ కాన్సెప్టుతో వచ్చిన 'విరూపాక్ష' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేశారు. ఇక్కడ హిట్ అవడంతో మే 5వ తేదీన హిందీ, తమిళం, మలయాళంలోనూ తీసుకొచ్చారు. కానీ, ఆ భాషల్లో ఇది సక్సెస్ కాలేదు. ఇక, గురువారం ఆ భాషల్లో జీరో షేర్‌తో ఈ సినిమా నిరాశ పరిచింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 3 Weeks Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:3 వారాల్లో తెలుగులో భారీ స్థాయిలో రూ. 36.88 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.91 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.83 కోట్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లకు కలిపి (మే 5 నుంచి) రూ. 57 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21 రోజుల్లోనే రూ. 46.19 కోట్లు షేర్‌, రూ. 90.05 కోట్లు గ్రాస్ వరకూ వసూలు చేసింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie 3 Weeks Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:భయపెట్టే కథతో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.21 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 21 రోజుల్లోనే దీనికి రూ. 46.19 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.19 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X