Virupaksha Day 4 Collections: వీకెండ్ తరువాత స్పీడ్ తగ్గినా... సెట్ చేసిన టార్గెట్ ఫినిష్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ ద్వారా కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. ఇక మొత్తానికి విడుదల రోజు ఆడియోన్స్ నుంచి టాక్ బాగుండడంతో రెండవ రోజు కలెక్షన్స్ మరింత పెరిగాయి. మూడవరోజు కూడా అదే తరహాలో కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ తర్వాత సోమవారం రోజు పర్వాలేదు అనే విధంగా కలెక్షన్స్ అందుకుంది. అయితే మొత్తానికి సినిమా టార్గెట్ ఫినిష్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఎంత వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..
బిజినెస్ ఎంతంటే?: సుకుమార్ రైటింగ్స్ లో బిబిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన విరూపాక్ష సినిమాకు టాలెంటెడ్ యువ దర్శకుడు కార్తీక్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా మంచి బిజినెస్ అయితే చేసింది. విరూపాక్ష సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 19.20 కోట్ల వరకు బిజినెస్ చేయగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని 22.20 కోట్ల బిజినెస్ అయితే చేసింది.

మొదటి వీకెండ్ కలెక్షన్స్ : ఇక విరుపాక్ష సినిమా మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. మొదటిరోజు 4.79 కోట్లు రాగా.. రెండవ రోజు అంతకంటే ఎక్కువగా 5.80 కోట్లు వచ్చాయి. ఇక మూడవరోజు కూడా ఏపీ నైజం లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. మూడో రోజు ఆదివారం కావడంతో 5.75 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో 16.30 కోట్ల రేంజ్ షేర్ కలెక్షన్స్ అందుకుంది.
థియేట్రికల్ ఆక్యుపెన్సీ : ఇక ఈ సినిమాకు థియేట్రికల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే నమోదవుతుంది. మొదటి మూడు రోజుల్లో వీకెండ్ కావడంతో సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక సోమవారం రోజు ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలైంది. అయినప్పటికీ మంచి థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదయింది. ఉదయం షోలకు 19% ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న విరుపాక్ష సినిమా మధ్యాహ్నం 27.45% నమోదయింది. ఇక సాయంత్రం షోలకు 29.18% నమోదైనట్లు సమాచారం. నైట్ షోలకు కూడా రెస్పాన్స్ అద్భుతంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

4వ రోజు ఎంత రావచ్చంటే.. : ఇక విరూపాక్ష సినిమా 4వ రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు అటు ఇటుగా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 4వ రోజు చూసుకుంటే విరూపాక్ష సినిమా మూడు కోట్ల రెండులో షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.
టార్గెట్ ఫినిష్: మొత్తానికి విరూపాక్ష సినిమా నాలుగవ రోజు కలెక్షన్స్ తో టార్గెట్ ఫినిష్ చేసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది. ఈ సినిమా మూడు రోజుల్లో మొత్తంగా 20.82 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక టార్గెట్ ఫినిష్ అవ్వాలి అంటే ఇంకా కేవలం 2.18 కోట్లు రావాలి. కాబట్టి నాలుగవ రోజు 3 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా 1 కోటికి పైగా షేర్ ప్రాఫిట్ తో ముందుకు కొనసాగే అవకాశం ఉంది. మరి మొత్తంగా విరూపాక్ష సినిమా ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











