Virupaksha Day 6 Collections: మెగా మేనల్లుడి దూకుడు మామూలుగా లేదు.. టోటల్ ప్రాఫిట్స్ ఎంతంటే?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుస ఫ్లాప్స్ అనంతరం మళ్ళీ మంచి సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా అతను డిఫరెంట్ హారర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ద్వారా కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. ఇక మొదటి రోజే పాజిటివ్ టాక్ గట్టిగా ఉండడంతో రెండవ రోజు నుంచి కలెక్షన్స్ మరింత పెరిగాయి. వీకెండ్ అనంతరం కూడా అదే తరహాలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక నాలుగవ రోజు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఫినిష్ చేసుకున్న ఈ సినిమా 6వ రోజు కూడా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమాకు ఇప్పటివరకు ఎంత వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..
విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ : కార్తిక్ దండు దర్శకత్వంలో సుకుమార్, బీవీఎస్ఏన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇక బిబిఎస్ఎన్ ప్రసాద్ తో సంయుక్తంగా నిర్మించిన విరూపాక్ష సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా మంచి బిజినెస్ అయితే చేసింది. విరూపాక్ష సినిమా ఏపి నైజాంలో 19.20 కోట్ల వరకు బిజినెస్ చేయగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని 22.20 కోట్ల బిజినెస్ అయితే చేసింది.

5 రోజుల కలెక్షన్స్ : విరుపాక్ష సినిమా మొదటి వీకెండ్ లోనే తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. మొదటిరోజు 4.79 కోట్లు రాగా.. 2వ రోజు అంతకంటే ఎక్కువగా 5.80 కోట్లు వచ్చాయి. ఇక 3వ రోజు 5.77 కోట్లు, 4వ రోజు 3.01 కోట్లు, 5వ రోజు 2.40 కోట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 5 రోజుల్లో 21.77 కోట్ల రేంజ్ షేర్ కలెక్షన్స్ అందుకుంది.
థియేట్రికల్ ఆక్యుపెన్సీ ఎంతంటే.. : మొదటి వీకెండ్ అనంతరం సినిమాకు థియేట్రికల్ ఆక్యుపెన్సీ బాగానే నమోదవుతుంది. సోమవారం రోజుతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ అయ్యింది. వారంతరం తరువాత నుంచే ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలైంది. 6వ రోజు బుధవారం మంచి థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఉదయం షోలకు 13% ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న విరుపాక్ష సినిమా మధ్యాహ్నం 24.45% నమోదయింది. ఇక సాయంత్రం షోలకు 22.18% నమోదైనట్లు సమాచారం. నైట్ షోలకు కూడా రెస్పాన్స్ అద్భుతంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

6వ రోజు ఎంత రావచ్చంటే..: విరూపాక్ష సినిమా ఐదు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అటు ఇటుగా 1.6 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 4వ రోజు చూసుకుంటే విరూపాక్ష సినిమా 2.3 కోట్ల రెండులో షేర్ కలెక్షన్స్ అందుకే అవకాశం సమాచారం. ఇక ఇండియాలో నెట్ కలెక్షన్స్ పరంగా దాదాపు 3 కోట్లు రావచ్చని టాక్.

ప్రాఫిట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే.. : బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన విరూపాక్ష సినిమా 4వ రోజు కలెక్షన్స్ తో టార్గెట్ ఫినిష్ చేసుకుంది. సినిమా 5 రోజుల్లో మొత్తంగా 27.82 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక టార్గెట్ ఫినిష్ అవ్వగా 6వ రోజు అయితే సినిమా 1.35 కోట్ల షేర్ తో ముందుకు సాగుతోంది. ఇక 6 రోజు కూడా 2.3 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సినిమా ఇప్పుడు మొత్తంగా 6 కోట్లకు పైగా ప్రాఫిట్ తో కొనసాగనుంది. వీకెండ్ అనంతరం కూడా సినిమాకు కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నాయి. మరి టోటల్ గా విరూపాక్ష సినిమా ఇంకా ఏ రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











