Virupaksha 6 Days Collections: 6వ రోజూ మాస్ బ్యాటింగ్.. అప్పుడే అన్ని కోట్లా.. మరో 11 లక్షలు వస్తే!
పెద్ద సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా పరిచయమైనా.. తనదైన ఆల్‌రౌండ్ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొంది.. చాలా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.
కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. యాక్సిడెంట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'విరూపాక్ష' అనే సినిమాతో వచ్చాడు. హర్రర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' మూవీ 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

విరూపాక్ష అంటూ భయపెట్టేలా: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కలయికలో రూపొందిన చిత్రమే 'విరూపాక్ష'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ అయింది.
6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 6వ రోజూ 'ఆంధ్రా, తెలంగాణలో విరూపాక్ష' మూవీకి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 86 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 25 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 1.82 కోట్లు షేర్, రూ. 3.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

6 రోజులకూ ఎంత వచ్చింది?: తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో 'విరూపాక్ష' మూవీకి భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.42 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.03 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.65 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.16 కోట్లు, గుంటూరులో రూ. 1.61 కోట్లు, కృష్ణాలో రూ. 1.54 కోట్లు, నెల్లూరులో రూ. 76 లక్షలతో కలిపి.. రూ. 23.59 కోట్లు షేర్, రూ. 40.60 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 6 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 23.59 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.20 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లోనే రూ. 29.89 కోట్లు షేర్, రూ. 53.85 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: హర్రర్ జోనర్‌లో వచ్చిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 29.89 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.89 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసేసుకుంది.
అక్కడ రికార్డు.. 11 లక్షలు వస్తే: సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీకి భారీ స్థాయిలోనే స్పందన దక్కుతోంది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధించిన సూపర్ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో తాజాగా ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును సైతం చేరుకుంది. దీనితో పాటు మరో రూ. 11 లక్షలు వసూలు చేస్తే.. ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 30 కోట్లు షేర్ మార్కును చేరుకుని రికార్డును సాధిస్తుంది.


Click it and Unblock the Notifications











