Virupaksha Day 7 Collections: వారం రోజుల్లోనే సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ రికార్డ్.. అసలైన బిగ్ హిట్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తరువాత బాక్సాఫీస్ వద్ద ఒక బిగ్ హిట్ అందుకున్నాడు. విరూపాక్ష సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డేనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. వీకెండ్ అనంతరం కూడా అదే తరహాలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక 7వ రోజు కూడా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమాకు ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..
విరూపాక్ష ప్రీ రిలీజ్ బిజినెస్ : సుకుమార్, బీవీఎస్ఏన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ దండు దర్శకత్వం వహించగా.. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకు సగం సుకుమార్ వల్లే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా మంచి బిజినెస్ అయితే క్తియేట్ చేసింది. విరూపాక్ష సినిమా ఏపి నైజాంలో 19.20 కోట్ల వరకు బిజినెస్ చేయగా ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని 22.20 కోట్ల బిజినెస్ అయితే చేసింది.

ఆరు రోజుల కలెక్షన్స్ : విరుపాక్ష సినిమా మొదటి వీకెండ్ లోనే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు 4.79 కోట్లు రాగా.. 2వ రోజు అంతకంటే ఎక్కువగా 5.80 కోట్లు వచ్చాయి. ఇక 3వ రోజు 5.77 కోట్లు, 4వ రోజు 3.01 కోట్లు, 5వ రోజు 2.40 కోట్లు, 6వ రోజు 1.84 కోట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా వారంలో 23.61 కోట్ల రేంజ్ షేర్ కలెక్షన్స్ అందుకుంది.

థియేట్రికల్ ఆక్యుపెన్సీ ఎంతంటే..:వీకెండ్ తరువాత కూడా సినిమాకు థియేట్రికల్ ఆక్యుపెన్సీ బాగానే నమోదవుతుంది. ఇక 4వ రోనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ అయ్యింది. వీకెండ్ అనంతరం సినిమాకు అసలు పరీక్ష మొదలైంది. అయినప్పటికీ మంచి థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. 7వ రోజు ఉదయం షోలకు 13% ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న విరుపాక్ష సినిమా మధ్యాహ్నం 22.45% నమోదయింది. ఇక సాయంత్రం షోలకు 20.18% నమోదైనట్లు సమాచారం. నైట్ షోలకు కూడా రెస్పాన్స్ అద్భుతంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.
7వ రోజు ఎంత రావచ్చంటే..: విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఏపీ నైజాం లో సినిమాకు 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 7వ రోజు చూసుకుంటే విరూపాక్ష సినిమా 1.7 కోట్ల రెండులో షేర్ కలెక్షన్స్ అందుకే అవకాశం సమాచారం. ఇక ఇండియాలో నెట్ కలెక్షన్స్ పరంగా దాదాపు 3 కోట్లు రావచ్చని టాక్.

విరూపాక్ష టోటల్ ప్రాఫిట్స్: డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన విరూపాక్ష సినిమా 4వ రోజు కలెక్షన్స్ తో టార్గెట్ ఫినిష్ చేసుకుంది. ఇక సినిమా 6 రోజుల్లో మొత్తంగా 29.82 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక టార్గెట్ ఫినిష్ అవ్వగా 7వ రోజు అయితే సినిమా 1.7 కోట్ల షేర్ తో ముందుకు సాగుతోంది. కాబట్టి సినిమా ఇప్పుడు మొత్తంగా 7 నుంచి 8 కోట్ల మధ్యలో ప్రాఫిట్స్ తో కొనసాగనుంది. వీకెండ్ తరువాత కూడా సినిమాకు కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నాయి. ఇక టోటల్ గా సినిమా ఇంకా ఏ రేంజ్ లో షేర్ అందుకంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











