Virupaksha 8 Days Collections: విరూపాక్షను ఆపలేకపోయిన ఏజెంట్.. 8వ రోజూ భారీగా.. 4 లక్షలొస్తే సంచలనమే
టాలీవుడ్‌లో ప్రస్తుతం టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకడు. బ్యాగ్రౌండ్ ఉన్నా కష్టపడేతత్వంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న అతడు.. విలక్షణమైన నటనతో సత్తా చాటుతోన్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మెగా హీరో 'విరూపాక్ష' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్రర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' మూవీ 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!

హర్రర్ థ్రిల్లర్‌తో వచ్చిన హీరో: సాయి ధరమ్ తేజ్ - కార్తీక్ దండు కాంబినేషన్‌లో రూపొందిన హర్రర్ మూవీనే 'విరూపాక్ష'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ అయింది.
8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 8వ రోజూ ఆంధ్రా, తెలంగాణలో 'విరూపాక్ష' మూవీకి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 44 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 1.12 కోట్లు షేర్, రూ. 2.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

8 రోజులకూ ఎంత వచ్చింది?: తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 'విరూపాక్ష' మూవీకి భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.85 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, గుంటూరులో రూ. 1.75 కోట్లు, కృష్ణాలో రూ. 1.70 కోట్లు, నెల్లూరులో రూ. 83 లక్షలతో కలిపి.. రూ. 26.23 కోట్లు షేర్, రూ. 45.40 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 8 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 26.23 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.27 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.46 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లోనే రూ. 32.96 కోట్లు షేర్, రూ. 59.60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: భయపెట్టే కథతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లోనే దీనికి రూ. 32.96 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.96 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసేసుకుంది.
40 లక్షలు.. 4 లక్షలు దూరంలో: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ 'విరూపాక్ష'కు రెండో వారంలోనూ మంచి ఆరంభం దక్కింది. ఒకవైపు 'ఏజెంట్' మూవీ ఉన్నా.. దీనికి కోటికి పైగానే షేర్ వచ్చింది. ఇక, ఈ సినిమాకు మరో రూ. 40 లక్షలు గ్రాస్ వస్తే రూ. 60 కోట్లు మార్కును చేరుకుంటుంది. అలాగే, రూ. 4 లక్షలు షేర్ వస్తే.. రూ. 10 కోట్ల లాభాల మైలురాయిని చేరి రికార్డు కొడుతుంది.


Click it and Unblock the Notifications











