Virupaksha Collections: 9వ రోజు మళ్ళీ పెరిగిన విరూపాక్ష కలెక్షన్స్.. ఏజెంట్ సినిమాకు ధీటుగా..
సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వద్ద మొదట్లోనే మంచి కలెక్షన్స్ అందుకుంది. మొత్తానికి తేజ్ విరూపాక్ష సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన విరూపాక్ష సినిమా పెద్దగా హడావుడి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వీకెండ్ అనంతరం కూడా అదే తరహాలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక 9వ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక సినిమాకు ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..
ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు: బీవీఎస్ఏన్ ప్రసాద్ సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు యువ దర్శకుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించగా.. సుకుమార్ కథనం అందించారు. ఇక సినిమాకు సగం సుకుమార్ వల్లే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక మార్కెట్లో సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా మంచి బిజినెస్ అయితే క్రియేట్ చేసింది. విరూపాక్ష సినిమా ఏపి నైజాంలో 19.20 కోట్ల వరకు బిజినెస్ చేయగా ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని 22.20 కోట్ల బిజినెస్ అయితే చేసింది.

8 రోజుల కలెక్షన్స్ : 8వ రోజూ తెలుగు రాష్ట్రాల్లో 'విరూపాక్ష' మూవీకి మంచి స్పందన వచ్చింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 80 లక్షలు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 31 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 1.12 కోట్లు షేర్, రూ. 2.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

8 రోజుల మొత్తం ఎంతంటే..: ఏపీ తెలంగాణలో 8 రోజుల్లో 'విరూపాక్ష' మూవీకి భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 12.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.74 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.96 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.37 కోట్లు, గుంటూరులో రూ. 1.86 కోట్లు, కృష్ణాలో రూ. 1.81 కోట్లు, నెల్లూరులో రూ. 90 లక్షలతో కలిపి.. రూ. 28.23 కోట్లు షేర్, రూ. 48.40 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 8 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 28.23 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.70 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లోనే రూ. 35.96 కోట్లు షేర్, రూ. 63.60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
పెట్టిన పెట్టుబడికి లాభం ఎంత?: ఇక 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లోనే దీనికి రూ. 35.96 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 12.96 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసేసుకుంది.


Click it and Unblock the Notifications











