Virupaksha Day 1 Collections: సాయి తేజ్ సంచలనం.. విరూపాక్ష ఊచకోత.. తొలి రోజే అన్ని కోట్లతో రికార్డు

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటోన్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఆ మధ్య వరుస విజయాలతో సత్తా చాటిన అతడు.. 'రిపబ్లిక్' ఫ్లాప్, యాక్సిడెంట్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు.

వీటి నుంచి కోలుకుని ఇప్పుడు 'విరూపాక్ష' అనే హర్రర్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'విరూపాక్ష' ఫస్ట్ డే రిపోర్టును మీరే చూసేయండి!

Sai Dharam Tej Starrer Virupaksha Movie Day 1 Worldwide Official Collections

విరూపాక్షగా మారిన సాయి తేజ్: సాయి ధరమ్ తేజ్ హీరోగా.. కొత్త దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన మూవీనే 'విరూపాక్ష'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు నటించారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే: సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' మూవీకి నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ చేసుకుంది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie Day 1 Worldwide Official Collections

అలాంటి టాక్.. భారీ కలెక్షన్లు: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే అంతగా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే వసూళ్లు భారీగా దక్కాయి.

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 'విరూపాక్ష' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 54 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 58 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో కలిపి.. రూ. 4.79 కోట్లు షేర్, రూ. 8.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie Day 1 Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 4.79 కోట్లు కొల్లగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఓ రేంజ్‌లోనే సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 36 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే రూ. 6.35 కోట్లు షేర్‌, రూ. 11.85 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 6.35 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 16.65 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

Sai Dharam Tej Starrer Virupaksha Movie Day 1 Worldwide Official Collections

సాయి తేజ్ కెరీర్‌లో రెండోదిగా: హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'విరూపాక్ష' మూవీకి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్సే వచ్చింది. దీంతో ఈ చిత్రం మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.79 కోట్లు షేర్ రాబట్టింది. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో రెండో బెస్ట్ ఓపెనింగ్‌గా రికార్డు సాధించింది. దీనికంటే ముందు అతడు నటించిన 'విన్నర్' చిత్రం ఏకంగా రూ. 5.65 కోట్లు రాబట్టి టాప్‌లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X