Virupaksha: సాయి ధరమ్ తేజ్ నయా రికార్డు.. బిజినెస్ కోట్లలో.. థియేటర్లు మాత్రం!
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చినా.. చాలా తక్కువ సయమంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా పలు విభాగాల్లో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన అతడు.. పలు విజయాలను కూడా అందుకున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో అతడి గత చిత్రం 'రిపబ్లిక్' మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీనికితోడు యాక్సిడెంట్ అవడం వల్ల సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా మరింత ఆలస్యం అయింది. ఇక, ఇప్పుడతను 'విరూపాక్ష' మూవీ చేశాడు.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'విరూపాక్ష' అనే చిత్రాన్ని కార్తీక్ దండు దర్శకత్వంలో చేశాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విభిన్నమైన కథతో రూపొందించారు. ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ ప్రేక్షకుల మన్ననలు పొందాయి.
దీంతో ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది. ఇక, నేటి రాత్రి నుంచి ఓవర్సీస్‌లో 'విరూపాక్ష' మూవీ ప్రీమియర్స్‌ను కూడా గ్రాండ్‌గానే వేయబోతున్నారు.
'విరూపాక్ష' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ రూ. 23 కోట్లు వరకూ జరిగింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 238, సీడెడ్‌లో 165, ఆంధ్రాలో 310 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 715 నుంచి 720 థియేటర్లలో విడుదల అవుతోంది.
అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 75, ఓవర్సీస్‌లో 220 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 1010 నుంచి 1020 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది సాయి తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని తెలుస్తోంది. అయితే, బిజినెస్ ఎక్కువే జరిగినా థియేటర్ల సంఖ్య తగ్గిందనే టాక్ వినిపిస్తోంది.
'విరూపాక్ష' మూవీలో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











