Virupaksha Pre Release Bussiness: మెగా హారర్ సినిమాకు బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్.. ఎంత రావాలంటే?
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ బివిఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు అయితే కాస్త ఎక్కువగానే ఉన్నాయి.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం కూడా ఉంది. అయితే వరల్డ్ వైడ్ గా విరూపాక్ష సినిమా ఎంత బిజినెస్ చేసింది. అలాగే సక్సెస్ కావాలి అంటే ఎంత షేర్ కలక్షన్స్ రావాలి? అనే వివరాలను కూడా బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

సక్సెస్ కోసం: చాలా కాలంగా సాయిధరమ్ తేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడానికి కాస్త సతమతమవుతున్నాడు. అతను నటించిన చివరి రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. రిపబ్లిక్ సినిమా విడుదల సమయంలోనే ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ చాలా కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ విరుపాక్ష సినిమాతో ఎలాగైనా ట్రాక్లోకి రావాలి అని చూస్తున్నాడు.
మొదటిసారి ఇలాంటి సినిమాతో..: సుకుమార్ శిష్యుడు కార్తీక్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన విరూపాక్ష సినిమాపై అంచనాలు అయితే కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఒక హారర్ కాన్సెప్ట్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అది కూడా మెగా హీరో ఇలాంటి కథలో మొదటిసారి నటించడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా హడావిడిగా కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో చేసిన బిజినెస్: ఇక విరూపాక్ష సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ అయితే ఏర్పరచుకుంది. ఇక ఏ ఏరియాలో ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో 7.20 కోట్ల ధర పలికిన ఈ సినిమా వైజాగ్ లో 2.25 కోట్లు, ఈస్ట్ లో 1.45 కోట్లు, వెస్ట్ లో 1.25 కోట్లు, కృష్ణాలో 1.45 కోట్లు గుంటూరులో 1.65 కోట్లు, నెల్లూరులో 0.70 కోట్లు సీడెడ్ లో 3.85 కోట్లు ధర పలికింది.
ప్రపంచవ్యాప్తంగా: మొత్తంగా నైజాం ఆంధ్రప్రదేశ్లో విరూపాక్ష సినిమా 19.8 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక కర్ణాటకలో ఈ సినిమా ఒక కోటి వరకు బిజినెస్ చేయగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా లో 50 లక్షలు ఓవర్సీస్ లో 1.5 కోట్లు, ఇక మిగతా భాషల్లో 2.2 కోట్ల రేంజ్ లో ఈ సినిమా మంచి బిజినెస్ అయితే చేసినట్లుగా తెలుస్తోంది.

సక్సెస్ కావాలి అంటే ఎంత రావాలి: ప్రపంచవ్యాప్తంగా విరూపాక్ష సినిమా 25 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద 26 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ తప్పనిసరిగా రావాలి. ఇప్పటికే నాన్ థియేట్రికల్ గా అయితే నిర్మాతలు మంచి ప్రాఫిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు థియేట్రికల్ గా ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు అందిస్తే ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కు మంచి బూస్ట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. మరి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











