Virupaksha Collections: భారీగా పెరిగిన విరూపాక్ష కలెక్షన్స్.. ఒక్కరోజే అన్ని కోట్లు.. లాభం ఎంతో తెలిస్తే?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన మొదటి సినిమా విరూపాక్ష. హిట్లు ప్లాప్ లతో సతమతం అవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి ఊహించని విధంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో విరూపాక్ష సినిమాకు 10వ రోజు వచ్చిన కలెక్షన్స్ వివరాలపై ఓ లుక్కేస్తే..

నటీనటులు..:సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చింది విరూపాక్ష. ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం కాగా ఇందులో మలయాళ బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా అలరించింది. సోనియా సింగ్, రవి కృష్ణ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించాయి.

Sai Dharam Tej Virupaksha 10 Days Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన విరూపాక్ష సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో తెలంగాణలోని నైజాం ఏరియాలో రూ. 7 కోట్లు, సీడెడ్ రూ. 3.7 కోట్లు, ఆంధ్రాలో రూ. 8.5 కోట్లతో అన్నీ కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ అయింది.

Sai Dharam Tej Virupaksha 10 Days Worldwide Box Office Collection

థియేటర్ ఆక్యుపెన్సీ..:విరూపాక్ష సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తన నటనతో ఆకట్టుకుందని ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు 9వ రోజున భారీగానే ఆక్యుపెన్సీ లభించింది. ఉదయం 31.92 శాతం, మద్యాహ్నాం 51.74 శాతం, సాయంత్రం 65.06 శాతం, నైట్ షోలకు 60.22 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆదివారం కావడంతో సినిమాకు ప్రేక్షకులు బాగా వచ్చినట్లు అర్థం అవుతోంది.

Sai Dharam Tej Virupaksha 10 Days Worldwide Box Office Collection

10వ రోజు కలెక్షన్స్ :సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో విరూపాక్ష సినిమాకు 10వ రోజున నైజాం రూ. 94 లక్షలు, సీడెడ్ రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 12 లక్షలు, గుంటూరు రూ. 17 లక్షలు, కృష్ణా రూ. 17 లక్షలు, నెల్లూరు రూ. 8 లక్షలతో రూ. 2.38 కోట్ల షేర్, రూ. 4.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

Sai Dharam Tej Virupaksha 10 Days Worldwide Box Office Collection

10 రోజుల్లో.. లాభం ఎంతంటే?:విరూపాక్ష సినిమాకు ప్రపంచవ్యాప్తంగానూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ 10 రోజుల్లో నైజాం రూ. 13.29 కోట్లు, సీడెడ్ రూ. 4.42 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 4.15 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 2.11 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 1.49 కోట్లు, గుంటూరు రూ. 2.03 కోట్లు, కృష్ణా రూ. 1.98 కోట్లు, నెల్లూరు రూ. 98 లక్షలు వసూలు చేసింది. అంటే 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 30.45 కోట్ల షేర్, 53.15 కోట్ల గ్రాస్ సాధించింది.

Sai Dharam Tej Virupaksha 10 Days Worldwide Box Office Collection

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?:విరూపాక్ష సినిమాకు 10 రోజుల్లో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.86 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ. 37.76 కోట్లు షేర్‌, రూ. 76 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అంటే ఈ సినిమాకు రూ. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా రూ. 14.76 కోట్ల లాభంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X