Virupaksha Collections: సగానికి పడిపోయిన విరూపాక్ష కలెక్షన్స్.. అయినా తగ్గని జోరు.. లాభాలు మాత్రం!

మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే రిపబ్లిక్ తర్వాత సాయి ధరమ్ తేజ్ మరో సినిమా చేసేందుకు చాలా గ్యాప్ తీసుకున్నాడు.

అందుకు కారణాలు తెలిసిందే. ఇక తాజాగా విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికీ రూ. 70 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమాకు కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఈ క్రమంలో విరూపాక్ష సినిమాకు 11వ రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూళైందనే వివరాల్లోకి వెళితే..

Sai Dharam Tej Virupaksha 11 Days Worldwide Box Office Collection

సుకుమార్ శిష్యుడు: హిట్లు ప్లాప్ లతో సతమతం అవుతున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాను హారర్ జోనర్ లో తెరకెక్కించారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Sai Dharam Tej Virupaksha 11 Days Worldwide Box Office Collection

బిజినెస్ వివరాలు: సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్ పై నిర్మించిన విరూపాక్ష మూవీ ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాం ఏరియాలో రూ. 7 కోట్లు, సీడెడ్ రూ. 3.7 కోట్లు, ఆంధ్రాలో రూ. 8.5 కోట్లతో అంతా కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది.

Sai Dharam Tej Virupaksha 11 Days Worldwide Box Office Collection

11వ రోజు వసూళ్లు: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్షకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి 11వ రోజున నైజాం రూ. 72 లక్షలు, సీడెడ్ రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 28 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 8 లక్షలు, గుంటూరు రూ. 10 లక్షలు, కృష్ణా రూ. 11 లక్షలు, నెల్లూరు రూ. 4 లక్షలు వచ్చాయి. మొత్తంగా రూ. 1.66 కోట్ల షేర్, రూ. 2.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సోమవారం కావడంతో సండేతో పోల్చుకుంటే సగం కలెక్షన్స్ తగ్గాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ: విరూపాక్ష సినిమాకు ఇప్పటికీ 11 రోజుల్లో నైజాం రూ. 14.01 కోట్లు, సీడెడ్ రూ. 4.64 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 4.43 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 2.22 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 1.57 కోట్లు, గుంటూరు రూ. 2.13 కోట్లు, కృష్ణా రూ. 2.09 కోట్లు, నెల్లూరు రూ. 1.02 కోట్లు వసూలు చేసింది. అంటే విరూపాక్షకు 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 32.11 కోట్ల షేర్, రూ. 56.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

Sai Dharam Tej Virupaksha 11 Days Worldwide Box Office Collection

ప్రపంచవ్యాప్తంగా.. లాభాలు: విరూపాక్ష చిత్రం 11 రోజుల్లో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.96 కోట్ల వసూళ్లు సాధించింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో రూ. 39.59 కోట్లు షేర్‌, రూ. 79.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అంటే ఈ సినిమాకు రూ. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని ఛేదించి రూ. 16.59 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X