Virupaksha Collections: విరూపాక్షకు ఊహించని కలెక్షన్స్.. అక్కడ మాత్రం మరోలా.. లాభాలు ఎంతంటే?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన మొదటి సినిమా విరూపాక్ష. హిట్లు ప్లాప్ లతో సతమతం అవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ మూవీ మంచి హిట్ అందించింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి ఊహించని విధంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో విరూపాక్ష సినిమాకు 25వ రోజు వచ్చిన కలెక్షన్స్ వివరాలపై ఓ లుక్కేస్తే..
నటీనటులు..: సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిందే విరూపాక్ష. ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం కాగా ఇందులో మలయాళ బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా అలరించింది. సోనియా సింగ్, రవి కృష్ణ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన విరూపాక్ష చిత్రానికి మొదట్లోనే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో తెలంగాణలోని నైజాం ఏరియాలో రూ. 7 కోట్లు, సీడెడ్ రూ. 3.7 కోట్లు, ఆంధ్రాలో రూ. 8.5 కోట్లతో అన్నీ కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ రూ. 1.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ అయింది.

తెలుగులో కలెక్షన్స్: సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో విరూపాక్ష సినిమాకు 25వ రోజున తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని మొత్తంగా రూ. 14 లక్షలు వసూలు చేసింది.

25 రోజుల్లో వచ్చింది: ఏప్రిల్ 21న విడుదలైన విరూపాక్ష మూవీకి 25 రోజుల్లో నైజాం రూ. 16.05 కోట్లు, సీడెడ్ రూ. 5.52 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 5.26 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 2.62 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 1.89 కోట్లు, గుంటూరు రూ. 2.52 కోట్లు, కృష్ణా రూ. 2.53 కోట్లు, నెల్లూరు రూ. 1.26 కోట్లు వసూలు చేసింది. అంటే 25 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.68 కోట్ల షేర్, 65.95 కోట్ల గ్రాస్ సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా.. లాభం ఎంతంటే?: విరూపాక్ష సినిమాకు 25 రోజుల్లో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.94 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.86 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను హిందీ, తమిళం, మలయాళం భాషల్లో మే 5న రిలీజ్ చేశారు. ఈ భాషల్లో ఇప్పటికీ రూ. 57 లక్షలు వసూలు కాగా.. గత ఐదు రోజుల్లో జీరే షేర్ వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా రూ. 47.05 కోట్లు షేర్, రూ. 87.60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికీ ఈ మూవీ నిర్మాతలకు రూ. 24.05 కోట్ల లాభం వచ్చిం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











