Virupaksha: సాయి ధరమ్ తేజ్ థ్రిల్లర్ సినిమాకు అదిరిపోయే డీల్.. ప్రాఫిట్ వచ్చేలా థియేట్రికల్ రైట్స్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా విరుపాక్ష. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ రచయితగా వర్క్ చేయగా ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటిసారి సుకుమార్ రైటింగ్స్ నుంచి ఒక డిఫరెంట్ త్రిల్లర్ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సాయి ధరమ్ తేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చూస్తున్నాడు.
అతను నటించిన చివరి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఇక ఈ సినిమా మాత్రం ఓవర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలోని యాక్షన్ అంశాలతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మూఢనమ్మకాలు అలాగే చేతబడులు నేపథ్యంలో కూడా కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ అవుతాయట.

ఇక హీరో పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విరుపాక్ష సినిమాపై పెరుగుతున్న బజ్ కారణంగా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక సినిమా థియేట్రికల్ హక్కులకు ఇప్పుడు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ నైజాం హక్కులకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను ఒక డిస్ట్రిబ్యూటర్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
వెస్ట్ గోదావరి కి చెందిన డిస్ట్రిబ్యూటర్ ప్రవీణ్ విరుపాక్ష సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను 22 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు సాయిధరమ్ తేజ్ కెరీర్ లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అయితే డీల్ రాలేదు. మొదటిసారి విరుపాక్ష సినిమాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడుతుంది. ఇక మొత్తంగా ఈ సినిమా అయితే మార్కెట్లో 30 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఏ స్థాయిలో షేర్ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











