Republic Movie Day 2 collections: సాయి తేజ్ సినిమాకు షాకింగ్ కలెక్షన్లు.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!

పేరుకు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడే అయినా.. కెరీర్ ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకుంటూ సత్తా చాటిన అతడు.. మధ్యలో చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో కొన్నేళ్ల క్రితమే హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'రిపబ్లిక్' అనే మూవీ చేశాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం పదండి!

‘రిపబ్లిక్' అంటూ వచ్చిన సాయి తేజ్

‘రిపబ్లిక్' అంటూ వచ్చిన సాయి తేజ్

ఫుల్ ఫామ్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు దేవ కట్టాతో 'రిపబ్లిక్' అనే సినిమాను చేశాడు. దీన్ని భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేయగా.. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించింది. మణి శర్మ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు.

భారీ అంచనాలు.. బిజినెస్ వివరాలివే

భారీ అంచనాలు.. బిజినెస్ వివరాలివే

వరుస హిట్లతో దూసుకెళ్తోన్న సాయి ధరమ్ తేజ్ హీరో కావడం.. ప్రత్యేక గుర్తింపు ఉన్న దేవ కట్టా దర్శకుడు కావడంతో'రిపబ్లిక్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 13.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భారీ మొత్తమే అని టాక్.

రెండో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

రెండో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

'రిపబ్లిక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు అనుకున్నంత కలెక్షన్లు రాలేదు. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 11.40 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రెండో రోజు రూ. 1.24 కోట్లు షేర్, రూ. 2.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

రెండు రోజులకూ కలిపి ఎంత వచ్చాయి

రెండు రోజులకూ కలిపి ఎంత వచ్చాయి

మొదటి రోజు మాంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'రిపబ్లిక్' మూవీ రెండు రోజులకు కలిపి నైజాంలో రూ. 97 లక్షలు, సీడెడ్‌లో రూ. 67 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్‌లో రూ. 23 లక్షలు, వెస్ట్‌లో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 29 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో.. రూ. 3.25 కోట్లు షేర్, రూ. 5.40 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎలా

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ. 3.25 కోట్లు షేర్ రాబట్టిన సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 28 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 3.71 కోట్లు షేర్, రూ. 6.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా వీకెండ్‌లో మంచి కలెక్షన్లను అందుకుని ఈ చిత్రం సత్తా చాటింది.

Recommended Video

Sai Pallavi Heartfelt Speech About Nagarjuna In Love Story Success Meet
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎంత రావాలి

సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీ విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 13.60 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 14 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 3.71 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 10.29 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X