Republic 6Days collections: సాయి తేజ్‌కు ఊహించని కష్టం.. భారీగా పడిపోయిన వసూళ్లు.. అంతొస్తేనే హిట్
మెగా మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే తన సత్తాను నిరూపించుకున్న అతడు ఎన్నో విజయాలను అందుకున్నాడు. అయితే, మధ్యలో చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి' నుంచి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస హిట్లను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సాయి తేజ్ 'రిపబ్లిక్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆరు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

‘రిపబ్లిక్' అంటూ వచ్చిన మెగా హీరో
వరుస హిట్లతో జోష్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు దేవ కట్టాతో 'రిపబ్లిక్' అనే సినిమాను చేశాడు. దీన్ని భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేయగా.. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించింది. మణి శర్మ ఈ మూవీకి సంగీతం అందించాడు.

ఎన్నో అంచనాలు.. ప్రీ బిజినెస్ ఇలా
ఫుల్ ఫామ్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ హీరో కావడం.. ప్రత్యేక గుర్తింపు ఉన్న దేవ కట్టా దర్శకుడు కావడంతో'రిపబ్లిక్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 13.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భారీ బిజినెసే అని చెప్పుకోవాలి.

ఆరో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే
'రిపబ్లిక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.60 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.20 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1.40 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. ఆరో రోజు రూ. 20 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

ఆరు రోజులకూ కలిపి ఎంత వచ్చాయి
మాంచి ఓపెనింగ్స్ అందుకున్న 'రిపబ్లిక్' మూవీ దాన్ని నిలబెట్టుకోలేదు. దీంతో ఆరు రోజులకు నైజాంలో రూ. 1.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 68 లక్షలు, ఈస్ట్‌లో రూ. 39 లక్షలు, వెస్ట్‌లో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 42 లక్షలు, కృష్ణాలో రూ. 40 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలతో.. రూ. 5.35 కోట్లు షేర్, రూ. 8.90 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?
తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో రూ. 5.35 కోట్లు షేర్ రాబట్టిన సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 29 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 43 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ. 6.07 కోట్లు షేర్, రూ. 11.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అయితే, టాక్ బాగున్నప్పటికీ.. ఈ మూవీ కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇంకెంత రావాలి
సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 13.60 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 14 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఆరు రోజుల్లో రూ. 6.07 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 6.43 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











