For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'కర్ణాటక,తమిళనాడులలో...

    By Srikanya
    |

    హైదరాబాద్: శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. సెప్టెంబర్ 14న విడుదలకు సిద్దమువుతున్న ఈ చిత్రం తమిళనాడు,కర్ణాటకలలో కూడా భారీ గా విడుదల కానుంది. ఈగ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రం సీడెడ్,తమిళనాడు,కర్ణాటక రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరు లో ఈ చిత్రాన్ని ఇరవై ఐదు ప్రింట్లతో విడుదల చేస్తున్నారు. అలాగే తమిళనాడు లోనూ పెద్ద హీరోల సినిమాలతో సమానంగా ప్రింట్స్ వేసి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

    ఇక ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరిగిందని సమాచారం. దాదాపు అన్ని ఏరియాలు, ఓవర్ సీస్ కలుపుకుని మొత్తం 18కోట్లకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. చిత్రం బిజినెస్ గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఓవర్‌సీస్‌లో కూడా భారీ స్థాయిలో విడుదల ఉంటుంది. నైజాం ప్రాంతానికి 'దిల్'రాజు విడుదల చేస్తున్నారు. సీడెడ్, కర్నాటక 'ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేయనున్నారు. తెలుగు సినిమాల్లోనే రికార్డు స్థాయిలో అమెరికాలో 55 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తున్నాం. విజయలక్ష్మీ ఫిలింస్ ద్వారా ఆంధ్రాలో విడుదల కానుంది. వారం ముందు నుంచే విడుదలయ్యే ప్రతి థియేటర్ వద్ద ఆడ్వాన్స్ బుకింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.

    అలాగే...''అయిదేళ్ల క్రితం 'హ్యాపీడేస్' రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఆ సినిమా విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో... ఇప్పుడు అంతకంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సంగీత పరంగా మిక్కీ జె.మేయర్ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. తోట తరణి కళాదర్శకత్వం, విజయ్ సి.కుమార్ ఛాయాగ్రహణం, మార్తాండ్ కె.వెంకటేష్ కూర్పు ఈ చిత్రానికి ప్రధాన బలాలు అన్నారు. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నటించే అవకాశం రావడం పట్ల అభిజిత్, సుధాకర్, కౌశిక్, రష్మీశాస్త్రి ఆనందం వ్యక్తం చేశారు. అమిగోస్ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా రూపొందుతోంది.

    అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్‌లను తెరకు పరిచయం చేస్తూ శేఖర్‌కమ్ముల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. 'ఆనంద్'కు 'మంచి కాఫీలాంటి సినిమా' అనే ఉపశీర్షిక పెట్టాను. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'కి అలాంటి ట్యాగ్‌లైన్లు లేవు కానీ... 'ఇది మన సినిమా' అని మాత్రం చెప్పుతున్నాను. మనసున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ''పరీక్షలు రాశాం. ఫలితం ఎలా ఉంటుందో మాకు తెలుసు. తప్పకుండా విజయం సాధించితీరుతాం'' అని శేఖర్‌కమ్ముల చెప్పారు.

    English summary
    Sai Korrapati, who earlier produced hit film Eega and Andala Rakshasi, has now bought the theatrical rights of Sekhar Kammula's Life is Beautiful (LIB). Sources say that the promissing producer has bought the rights for Ceded, Tamil Nadu and Karnataka for a fancy price. Sai shall release the film in Bangalore with 25 prints and is also planning to release Life is Beautiful in a grand way in Tamil Nadu too. The producer has already proved his mettle with his innovative publicity campaigns for Eega and is all set to repeat the magic with LIB.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X