Shyam Singha Roy's Day 3 Collections.. ఏపీలో దారుణంగా.. ఓవర్సీస్‌లో స్టడీగా.. హిట్టా? ఫట్టా అంటే..

సాయిపల్లవి, నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లు సాధిస్తున్నది. అయితే రిలీజ్‌కు ముందు ఉన్న ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం పూర్తిగా చేరుకోలేకపోయిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. అయితే సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లాంటి హీరోయిన్లకు ఉన్న క్రేజ్ కారణంగా తొలి వారాంతంలో వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే నాని వ్యాఖ్యలు, ఏపీ మంత్రుల మాటల దాడి అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ చిత్రం 3వ రోజున ఎలాంటి వసూళ్లను నమోదు చేసిందంటే?

సాయిపల్లవి, కృతిశెట్టి క్రేజీగా

సాయిపల్లవి, కృతిశెట్టి క్రేజీగా

వరుసగా రెండు ఫ్లాపులను ఖాతాలో వేసుకొన్నా నాని తప్పకుండా సక్సెస్ చేజిక్కించాలనే కోరికతో ఎమోషనల్ కథతో శ్యామ్ సింగరాయ్‌పై ఆశలు పెట్టుకొన్నారు. ఉప్పెన తర్వాత కృతిశెట్టి, లవ్ స్టోరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సాయిపల్లవి కలిసి నటించడంతో ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయి. సినిమా టీజర్ ఆసక్తిని రేపినప్పటికీ.. ఆ క్రేజ్‌ను ట్రైలర్ నిలబెట్టలేకపోయింది.

మిక్స్‌డ్ రియాక్షన్ల మధ్య

మిక్స్‌డ్ రియాక్షన్ల మధ్య

ఇలాంటి మిశ్రమ అంశాల మధ్య భారీ సంఖ్యతో శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. నైజాంలో 152, సీడెడ్ 70కిపైగా, ఆంధ్రాలో 200 థియేటర్లకుపైగా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 425పైగా థియేటర్లలో రిలీజైంది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 250కిపైగా థియేటర్లు, ఓవర్సీస్‌లో 300కిపైగా థియేటర్లలో రిలీజైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000కిపైగా థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఓవర్సీస్‌లో 3 వ రోజు కలెక్షన్లు ఇలా..

ఓవర్సీస్‌లో 3 వ రోజు కలెక్షన్లు ఇలా..

ఓవర్సీస్‌లో శ్యామ్ సింగరాయ్ ఓ మోస్తారుగా, స్ట్రాంగ్‌గా వసూళ్లను రాబట్టింది. తొలి రోజున ప్రీమియర్లతో 133, 000 అమెరికన్ డాలర్లు, శుక్రవారం 130,000, శనివారం 150.000, ఆదివారం 140,000 వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 550,000 డాలర్లు వసూలు చేసి హాఫ్ మిలియన్ మార్కును చేరుకొన్నది.

ఏపీ, తెలంగాణలో 3వ రోజు

ఏపీ, తెలంగాణలో 3వ రోజు

ఇక శ్యామ్ సింగరాయ్ చిత్రం 3వ రోజున కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.1.97 కోట్లు, సీడెడ్‌లో 52 లక్షలు, ఉత్తరాంధ్రలో 38 లక్షలు వసూలు చేయడంతో మూడో రోజుల షేర్ 1.30 కోట్లుగా నమోదైంది. ఇక కృష్ణా జిల్లాలో మూడో రోజు 18 లక్షలకుపైగా వసూలు చేయడంతో 56 లక్షల షేర్‌ను సాధించింది. ఇక గుంటూరులో మూడో రోజు 25 లక్షలకుపైగా సాధించడంతో మూడు రోజుల షేర్ 76 లక్షలు సొంతం చేసుకొన్నది.

 ప్రపంచవ్యాప్తంగా శ్యామ్ సింగరాయ్

ప్రపంచవ్యాప్తంగా శ్యామ్ సింగరాయ్

ఇదిలా ఉండగా, శ్యామ్ సింగరాయ్ చిత్రం ఆంధ్రా, తెలంగాణలో మూడు రోజుల్లో 3.8 కోట్ల షేర్ సాధించింది. అమెరికాలో మూడు రోజుల్లో 3.75 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో మూడో రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో12.3 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 17.8 కోట్లుకుపైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను ఎక్కువ ప్రాంతాల్లో నిర్మాత వెంకట్ బోయినపల్లి సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతనేది క్లారిటీ లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

శ్యామ్ సింగరాయ్ లాభాల్లోకి రావాలంటే..

శ్యామ్ సింగరాయ్ లాభాల్లోకి రావాలంటే..

అయితే నాని కెరీర్‌లో అత్యంత బడ్జెట్‌తో రూపొందించిన చిత్రంగా శ్యామ్ సింగరాయ్ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం 60 నుంచి 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిందనే విషయం ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 25 కోట్లు మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూలు చేయాల్సి ఉంటుందనే చెబుతున్నారు. శ్యామ్ సింగరాయ్ సోమవారం బాక్సాఫీస్ వద్ద నిలబడితే మాత్రం లాభాల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X