Thandel Day 10 Collections : రూ.100 కోట్ల క్లబ్ లోకి ‘తండేల్’.. బాక్సాఫీస్ పై చైతూ వసూళ్ల దాడి
అక్కినేని నాగచైతన్య కెరీర్ లోనే 'తండేల్' మంచి హిట్ ను అందించింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇంత వరకు థియేటర్లలో మంచి పెర్ఫామెన్స్ ను అందించింది. ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రమిదే. అయితే కేవలం 9వ రోజు పూర్తయ్యే సరికి ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకొని చైతన్య కెరీర్ లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. మొదటి వారం బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను రాబట్టింది. ఇక రెండో వారం కూడా ఈ చిత్రం దంచికొట్టేలా కనిపిస్తోంది.
ఇప్పటి వరకు తొమ్మిది రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ ను వసూళ్లు చేసింది. ఈ సందర్భంగా పదో రోజు తండేల్ వసూళ్లు ఎలా ఉన్నాది ఒకరి చూద్దాం. పదో రోజు కూడా తండేల్ బాక్సాఫీస్ వద్ద మంచిగానే పెర్ఫామెన్స్ చేసింది. తండేల్ 10వ రోజు రూ.2.05 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇండియాలో ఫిబ్రవరి 16న సాయంత్రం వరకు ఈ వసూళ్లను రాబట్టింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 16 వరకు మొత్తంగా రూ.56 కోట్ల నెట్ ను వసూల్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం గీతా ఆర్ట్స్ ప్రకటించిన వివరాల ప్రకారం.. రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

ఇక తండేల్ ఆక్యుపెన్సీ కూడా నిలకడగానే కనిపిస్తోంది. ఈ రోజు మార్నింగ్ షోస్ కు 22.69%, ఆఫ్టర్ నూన్ షోస్ 41.21% ఆక్యుపెన్సీని కలిగి ఉండింది. ఇక ఈవెనింగ్, నైట్ షోస్ కు ఇంతకు మించి ఆక్యెపెన్సీ ఉండనుందని తెలుస్తోంది. ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 31.95% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఏదేమైనా తండేల్ చిత్రం సెకండ్ వీక్ కూడా అదరగొడుతోంది. ఇక తెలుగు స్టేట్స్ లో గత నాలుగు రోజులుగా రూ.2.2 కోట్లకు పైనే వసూళ్లు రాబుతోంది. ఎన్ని రిలీజేస్ ఉన్నా తండేలా బాటలో అడ్డు లేదనిపిస్తోంది. ఇలాగే సెకండ్ వీక్ కూడా సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ ఉండనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీవాసు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించారు. రూ.75 కోట్ల పెట్టుబడితో గ్రాండ్ గా తెరకెక్కించారు. విడుదలైన తొలిరోజు నుంచే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన చిత్రం కావడంతో నార్మల్ ఆడియెన్స్ కూడా థియేటర్లకు వస్తున్నారు. పైగా ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా ఉండటంతో థియేట్రికల్ రన్ మరింతగా సక్సెస్ అవుతోంది. వర్క్ డేస్ లో రూ.2 కోట్లకు తగ్గకుండా.. వీక్ డేస్ లో రూ.3 నుంచి రూ.4 కోట్ల మధ్య వసూళ్లను రాబడుతోంది. ఫిబ్రవరి, మార్చిలోనూ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో తండేల్ హవా కొనసాగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం ఎంత వసూల్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











