Thandel Day 8 Collections: తండేల్ ఎనిమిదో రోజు కలెక్షన్లు.. సెకండ్ వీక్ వసూళ్లు ఇలా..!
థియేటర్లలో ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రం 'తండేల్'. యువ సామ్రాట్ నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి రెండోసారి జంటగా నటించిన చిత్రమిది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పించగా.. బన్నీవాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే ఈ చిత్రం అంచనాలను రీచ్ అయ్యేలా బాక్సాఫీస్ వద్ద పెర్ఫామ్ చేస్తోంది. లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం యువతతో పాటు నార్మల్ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. వర్క్ డేస్ లోనూ ప్రేక్షకులను థియేటర్లలో కూర్చునేలా చేస్తోంది.
ఆడియెన్స్ నుంచి మంచి టాక్ దక్కించుకున్న 'తండేల్' చిత్రం.. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలుసుకుందాం. తొలిరోజే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి చైతూ కెరీర్ లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. డే1 నుంచి నేటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా వసూళ్లు రాబడుతోంది. ఇక ఏడో రోజు ఈ చిత్రం 2.25 కోట్ల నెట్ ను వసూల్ చేసింది. మొదటి వారం పూర్తయ్యే సరికి చైతూ వరల్డ్ వైడ్ గా రూ.49.4 కోట్ల నెట్ ను వసూల్ చేయగలిగారు. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్ల నెట్, హిందీ బెల్ట్ లో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ.0.47 కోట్లు వసూల్ చేసింది.

ఇక ఎనిమిదో రోజు ఈ చిత్రం ఎన్ని కోట్లు వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాయంత్రం వరకు తండేల్ ఎనిమిదో రోజు రూ.0.87 కోట్ల నెట్ వసూల్ చేసిందని తెలుస్తోంది. ఇంకా రాత్రి ఆటల కలెక్షన్ల లెక్క కలవాల్సి ఉంది. దీంతో మరింతగా నెట్ వసూల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కతో తండేల్ మొత్తంగా వరల్డ్ వైడ్ నుంచి రూ.50.27 కోట్ నెట్ ను వసూల్ చేసింది. చైతూ కెరీర్ లో ఇది మంచి పరిణామం అంటున్నారు. ఇక తండేల్ సెకండ్ వీక్ లో కూడా మంచి వసూళ్లనే రాబడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

తండేల్ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.52 కోట్ల మేర జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండింతులు తెలుపుతున్నారు. ఈ సినిమాకు ఇవ్వాళ మార్నింగ్ షోకు 20 శాతం ఆక్యుపెన్సీ రిజిస్టర్ అయింది. ఆఫ్టర్ నూన్ షోకు 26.67 శాతానికి పెరిగింది. ఇక ఈవెనింగ్ షో, నైట్ షోలకు ఇంతకు మించి ఆక్యుపెన్సీ ఉంటుందని సమాచారం. ఇవ్వాళ వాలెంటైన్స్ డే కావడం, పైగా వీకెండ్ రావడంతో 'తండేల్'కు సెకండ్ వీక్ లోనూ మంచి వసూళ్లు ఖాయమంటున్నారు. ఇప్పటికే రూ.85 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ టాక్. త్వరలోనే చైతూ రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తారనంటున్నారు.


Click it and Unblock the Notifications











