Thandel Day 14 Collections : ‘తండేల్’ 14వ రోజు కలెక్షన్స్.. రెండో వారం ముగిసే వరకు మారిన వసూళ్ల లెక్క!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య - సాయిపల్లవి లేటెస్డ్ ఫిల్మ్ 'తండేల్'. రెండు వారాల క్రితం ఫిబ్రవరి 7న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైంది. ఇండియాలో తెలుగుతోపాటు హిందీ, తమిళ వెర్షన్ లోనూ విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజే ప్రేక్షకులను మెప్పించి రూ.21 కోట్లు వసూళ్లు చేసింది. చైతూ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ కావడం విశేషం. మరోవైపు నాగచైతన్యకు రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిత్రం కూడా ఇదే కావడం విశేషం.
అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొన్నటి వరకు స్టడీగానే వసూళ్లు రాబట్టింది. మొదటి వారం కలెక్షన్లు అదిరిపోయాయి. ఇక సెకండ్ వీక్ లోనూ వీకెండ్ పూర్తయ్యే వరకు బాక్సాఫీస్ వద్ద తండేల్ తఢాకా చూపించింది. కొత్త రిలీజెస్ ఉన్నప్పటికీ తన సత్తా చాటింది. రోజుకు రూ.2కోట్లకు తగ్గకుండా మొదటి వారంలో.. రెండో వారంలో మూడు రోజుల వరకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు వసూళ్లు చేసింది. రెండో వీకెండ్ పూర్తయినా.. రోజుకు రూ.1కోటీ వసూల్ చేసింది.

అయితే.. తండేల్ మొన్నటి వరకు స్టడీగానే వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. డే11 నుంచే 'తండేల్' బాక్సాఫీస్ వద్ద వెనకంజ వేస్తోంది. క్రమక్రమంగా వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. తండేల్ తొమ్మిది రోజుల్లో రూ.100 కోట్లకు చేరుకుంది. ఆ నెక్ట్స్ డే10న రూ.3.1 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. డే11న 62 శాతానికి వసూళ్లు పడిపోవడం గమనార్హం. డే12న 13 శాతం వసూళ్లు తగ్గి రూ.కోటి వసూళ్లు చేసింది. డే13న 25 శాతం తగ్గడంతో కేవలం రూ.75లక్షల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. ఇలా నాలుగు రోజుల నుంచి తండేల్ కలెక్షన్స్ నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే డే14న వసూల్ కూడా భారీగా తగ్గిపోయింది. మొదటి వారంలో వర్క్ డేస్ లో అవరేజ్ గా రూ.2.50 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబట్టింది. ఇక రెండో వారం కూడా అదే స్థాయిలో పెర్ఫామెన్స్ చేస్తుందని భావించినప్పటికీ లెక్కలు మారుతున్నాయి. డే13 కంటే ఐదు శాతం వసూల్ తగ్గి రూ.0.69 కోట్ల నెట్ వసూల్ చేసింది. హిందీలో రూ.లక్ష, తమిళంలో రూ.లక్ష నెట్ వసూల్ చేసింది. 14వ రోజు రూ.69 లక్షలు సాధించింది. దీంతో మొత్తం తెలుగు స్టేట్స్ లో రూ.60.51 కోట్ల నెట్ ను వసూల్ చేసింది తండేల్.
మొదటి వారం వారం పూర్తయ్యే సరికి రూ.49.4 కోట్ల నెట్ వసూల్ చేసింది 'తండేల్'. ఇందులో తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్లు వసూళ్లు చేసింది. ఇక రెండో వారం పూర్తయ్యే వరకు రూ.60.62 కోట్లు వసూళ్లు చేసిందీ చిత్రం. అయితే రెండో వారం మాత్రం రూ.11.11 కోట్ల నెట్ వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.80.5 కోట్ల నెట్, ఇండియా నెట్ : రూ.60.62, ఇండియా గ్రాస్ రూ.69.35 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇక మూడో వీకెండ్ లో 'తండేల్' కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు.


Click it and Unblock the Notifications











