Thandel Day 17 Collections : ‘తండేల్’ 17 రోజుల కలెక్షన్స్.. చైతూ తగ్గేదేలే?
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య - సాయిపల్లవి లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. ఫ్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తి మిళితమైన ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఫిబ్రవరి 7న విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద స్టడీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం తొలిరోజే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆసక్తిని క్రియేట్ చేసింది. నాగ చైతన్య కెరీర్ లోనే ఈ చిత్రం మొదటిరోజు అత్యధికంగా డే1 వసూళ్లు రాబట్టింది.
అయితే మొన్నటి వరకు వసూళ్లు తగ్గుతూ రావడంతో ఈ చిత్రం పోటీ నుంచి తప్పుకుంటుందేమోనని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మొదటి వారం రూ.3 నుంచి రూ.4 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబట్టింది. అలా ఫస్ట్ వీక్ మొత్తంగా 49.4 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.48.4 కోట్లు, హిందీలో రూ.0.53 కోట్ల నెట్, తమిళంలో రూ. 0.47 కోట్లు నెట్ రాబట్టింది. ఇక రెండో వారం ముగిసే సరికి రూ.11.3 కోట్ల నెట్ వసూల్ చేసింది. తెలుగుల స్టేట్స్ లో రూ.11.24కోట్లు, హిందీలో రూ.1 లక్ష, తమిళంలో రూ.5 లక్షల నెట్ వసూల్ చేసింది.

కాగా... మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా ఈ చిత్రం వసూళ్లు కాస్తా డల్ అయ్యాయి. రెండో వారం ముగింపులో డే14న రూ.70 లక్షలు, మూడో వారంలో మొదటి రోజు డే15న రూ.60 లక్షలు వసూల్ చేసింది. అప్పటికే మూడో శుక్రవారం విడుదలైన చిత్రాలతో 'తండేల్'కు పోటీ పెరిగింది. దీంతో మూడో వీక్ లో ఇంకా డీలా పడుతుందేమోననే సందేహం కలిగింది. కానీ తండేల్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ విజృంభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 74 శాతానికి వసూళ్లు పడిపోయి.. మళ్లీ నిలకడగా వసూళ్లును రాబడుతోంది. డే16తో తన శక్తిని చూపించింది. 16వ రోజున రూ.1.02 కోట్ల నెట్ వసూల్ చేసింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లోనే వసూళ్లు వస్తున్నాయి. హిందీ, తమిళంలో కొద్దిరోజులుగా ఆక్యుపెన్సీ లేదు. ఈ క్రమంలో డే17న రూ.1కోటి నెట్ వసూల్ రావడం ఆసక్తికరంగా మారాయి. థర్త్ వీక్ లో మూడో ఆదివారం ఇలా వసూళ్లు రాబట్టింది. ఇంకో మూడురోజులు ఇలా డీసెంట్ గా కలెక్షన్లు రాబడితే మాత్రం థర్డ్ వీక్ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినట్టేనని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.83 కోట్ల నెట్ ను వసూల్ చేసిందీ చిత్రం. ఇండియాలో రూ.63.48 కోట్ల నెట్ రాబట్టింది. ఇండియా గ్రాస్ రూ.71.85 కోట్లు కావడం విశేషం. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో రూ.11.15 కోట్ల నెట్ రాబట్టింది.
గత శుక్రవారం కొత్త రిలీజ్ లు 'డ్రాగన్', 'రామం రాఘవం', 'బాపు', 'జాబిలమ్మ నీకు అంత కోపమా' వంటి చిత్రాలు వచ్చినప్పటికీ.. తండేల్ పోటీలో నిలుస్తున్నట్టు కనిపిస్తోంది. థర్డ్ వీక్ కంప్లీట్ అయ్యే సరికి ఎంత వసూళ్లు రాబడుతుందనేది చూడాలి. ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











